పూర్వార్థమ్
25
తత్రతం బుద్ధిసంయోగం - లభతే పౌర్వ దైహికం
యతతే చ తతోభూయ - స్సంసిద్ది కురుసందన 6-43
అయితే ఇక్కడ ఒక సందేహం. ఎన్ని అవకాశాలయినా ఉండవచ్చు. పూల వాటిని మానవుడుపయోగించు కొన్నప్పుడే ఫలితమిస్తాయి. లేకుంటే అంగట్లో అన్నీ ఉన్నాయనే సామెతే అవుతుంది. ప్రస్తుత మిలాంటి సౌకర్యాలన్నీ మన కబ్బినందుకవి మనకు ఉపయోగపడతాయా, పడతాయని. ఏమి నమ్మకం అని మరలా ప్రశ్న.
పడతాయనే చెబుతున్నాడు పరమాత్మ. యోగభ్రష్టుడే వాతావరణంలో జన్మించినా వాడికా వాతావరణాన్ని ఉపయోగించుకునే బుద్ధిబలం కూడా జన్మ తోనే వస్తుంది. జన్మతోనే వస్తుందంటే ఎప్పటిదది. ఇంతకు ముందు జన్మల తాలూకు సంచితం. దాని సంస్కార మెక్కడికీ పోడు. ఎన్ని జన్మలు గడచినా అది వాడికి మాత్రమే హక్కుభుక్తం. తన్మూలంగా పూర్వ మెలాటి బుద్దిబల ముందో మానవుడి కదే ఇప్పటి జన్మలోకూడా తటస్థ మవుతుంది.
అంతేగాదు. ఆ బలంతో వాడిప్పుడంతకన్నా ఎక్కువగా ప్రయత్నం సాగి స్తాడు. అలా సాగించినప్పుడే అంతకంతకు ముందుకుపోగలడు సాధకుడు. లేకపోతే పాతరలో ధాన్యం లాగా ఎంత పోగుజేస్తే అంతటితోనే నిలిచిపోయే ప్రమాచ మున్నది. కాబట్టి జన్మాంతరంలో చేసుకొన్నది కొంతా-దాని ఆసరాతో మరలా మనం సాగించేది కొంతా-రెండూ కలిసి సాధన పెరుగుతూ పోతుందని భావించాలి మనం. ఒకటి అసలైతే మరి ఒకటి దానిపైన పెరిగే వడ్డీ లాంటిది.