పూర్వార్థమ్
24
ఆథవా యోగినా మేవ కులే భవతి ధీమతాం
ఏతద్ది దుర్లభ తరం - లోకే జన్మయ దీదృశమ్ 6-42
ఇంకా కొంత దూరం పోయి హామీ ఇస్తున్నాడు భగవానుడు. ఆచారమూ ఐశ్వర్యమూ ఉన్న ఇళ్ళలోనే కాదు. దేవుడు మేలు చేస్తే యోగాభ్యాస పరుల ఇంటిలోనే జన్మించినా జన్మించవచ్చు. శుకుడూ శంకరుడూ మొదలైన తత్త్వ వేత్తల జన్మ లిట్లాంటివే లాంటి జన్మ రావడం చాలా అపురూపం. ఎవరి కంటే వారికి లభించే సంవద గాదిది.
ఎందు కంటే ఆచార మనేది మనశ్శుద్ధి నీయవచ్చు. ఐశ్వర్యం మానవుడికి కొన్ని సౌకర్యాలు కల్పించవచ్చు. కాని అది కేవలం బాహ్యారూపమే యోగానికి అంత మాత్రాన ప్రయోజనం లేదు. అంతర్యాన్ని మన మనుభవానికి తెచ్చుకోవాలి. అది అనుభవజ్ఞులు మాత్రమే మనకు ప్రసాదించగలరు. అట్టి వారు దేశంలో ఎక్కడ ఉన్నారో వెతుకుతూ పోవడం కష్టం. వెతికినా దొరకనూ వచ్చు. దొరకకనూ పోవచ్చు. అలాకాక వారితో మనకు రక్త సంబంధమే ఉంటే ఎంతో మేలుగదా. ఎప్పుడూ వారు మనకు కనిపిస్తూ ఉంటారు. తరచుగా వారివల్ల ఎన్నో యోగ రహస్యాలు తెలుసుకోవచ్చు సాధకుడు. ఇది దీనిలో ఉన్న విశేషం.