#



Back

పూర్వార్థమ్


23
ప్రాప్య పుణ్య కృతాం లోకా-నుషిత్వా శాశ్వతీ స్సమాః
శుచీనాం శ్రీ మతాం గేహే-యోగ భ్రష్టోభి జాయతే  6-41

అంతేగాదు. ఎలాంటి గతి పొందుతాడని గదా అడిగావు వాడు చచ్చిన తరువాత పుణ్యలోకాలకు పోతాడు. అక్కడ చాలా కాలం సుఖంగా బ్రతుకు తాడు. అది సమాప్తం కాగానే మరలా ఈ లోకంలో వచ్చి జన్మిస్తాడు. అది కూడా ఎక్కడో పనికిరాని చోట గాదు. శుచీ శుభ్రతా ఉండే కుటుంబంలోనూ జన్మిస్తాడు.

శుచిత్వమూ - ఐశ్వర్యమూ ఈ రెండింటినీ పేర్కొనటంలో ఒక విశేష మున్నది. శుచిత్వ మున్న ఇంట్లో జన్మిస్తే జన్మతోనే వాడి కొక మానసిక నైర్యల్య మేర్పడుతుంది దానికి తోడు ఐశ్వర్యమూ ఉంటే అభ్యాసాని కెక్కువ ఆటంకం లేకుండా సాగిపోతుంది. దానితో ముందు జన్మలలో మందకొడిగా సాగిన ప్రయత్న మీ జన్మలో బాగా ముందుకు సాగటాని కవకాశ ముంటుంది.