పూర్వార్థమ్
22
పార్థ నై వేహ నాముత్ర-వినాశస్తస్య విద్యతే
సహి కల్యాణకృత్ కశ్చిత్ -దుర్గతిం తాత గచ్ఛతి 6-40
చెబుతున్నాడు సమాధానం శ్రీకృష్ణ భగవానుడు. ఎంత అభ్యాస పాటవం లేకపోయినా శ్రద్దా వంతుడైన వాడెప్పటికీ దెబ్బతినడు. ఇహం లోనూ వరం లోనూ ఎక్కడా వాడికి వినాశనం లేదు. కాకపోయినా పాడైపోవటానికి వాడేమి దుర్మార్గం చేశాడని. ప్రయత్న మెక్కువగా చేయలేడంత మాత్రమే. అయినా శ్రద్ధ అనేదొక్కటి ఉంది గదా. శ్రద్ద దైప గుణాలలో ఒకటిగా పరిగణించబడింది. అది అన్ని సిద్ధులకూ మూలం. అసలు శ్రద్ద ఉన్నవాడు ప్రయత్నం కూడ చేయకు పోడు. అయితే తగినంత బలంగా చేయకపోవచ్చు. అంత మాత్రాన మోసం లేదు చేసినంత వరకూ అది మంచిపనే. మరి మంచి చేసిన వాడెన్నటికీ వంచితుడు కాడు. అధోగతి కంత కన్నా పోడు. ఇది ముమ్మాటికీ సత్యం.