ఉత్తరార్ధమ్
115
నష్టో మోహః స్మృతిర్లబ్ధా - త్వత్ప్రసాదా న్మయా చ్యుత
స్థితోస్మి గత సందేహః - కరిష్యే వచనమ్ తవ 18-73
ప్రస్తుతం జగద్గురు వడిగిన ప్రశ్నకు జగచ్ఛిష్యుడైన అర్జునుడు సమాధాన మిస్తున్నాడు. జగచ్ఛిష్యుడంటే జగత్తుకంతా ప్రతినిధి అయిన శిష్యుడు. మనబోటి మానవుల కంతా ప్రతినిధి అర్జునుడు. "శిష్యస్తేహమ్ శాధిమా” మ్మని శిష్య భావంతోనే ప్రాధేయపడ్డాడు పరమాత్మను. అంతవరకూ భగవానుడాయనకు బోధే చేయలేదసలు. శిష్యుడ్జీ- నన్ను శాసించ మన్నప్పుడే ఉపక్రమించాడు. గీతోపదేశం. శాసితుమ్ యోగ్యః శిష్యః శాసించటానికి యోగ్యు డువడో వాడే శిష్యుడు. ఆ యోగ్యత ఎప్పుడేర్పడుతుంది. ప్రణి పాత పరి ప్రశ్న సేవాదులతో గాని ఏర్పడదది. అవి మూడూ పుష్కలంగా ఉన్నా యర్జునుడికి. మనకుగూడా అలాంటి లక్షనాలుంటేనే గురూపదేశానికి నోచుకొంటాము.
ఉపదేశం బాగా పనిచేసినందు కది మన కివ్వవలసిన ఫలితాలు రెండే. ఒకటి మోహనాశము, మరొకటి స్మృతి లాభమూ, మోహమంటే మనకు భిన్నంగా అనాత్మ ప్రపంచ మేదో ఉందనే భ్రమ. అది పూర్తిగా నశించాలి మనకు. అలా నశించాలంటే దానికి ముందు స్మృతి అనేది లభించాలి. ఏమిటా స్మృతి. ఆత్మ చైతన్యమనే దొక్కటే ఉంది - అది మన స్వరూపమే- మనమేననే స్ఫురణ. ఇందులో అజ్ఞానం నశించటం ప్రతిలోమమైతే ఆత్మజాన ప్రాప్తి అనులోమం. అప్పుడంతా ఆత్మ తత్త్వంగానే భాసిస్తుంది కాబట్టి ద్వితీయమైన పదార్ధమేలేదు. ద్వితీయ మనేది లేకుంటే ఇక ఎలాంటి సందేహానికీ ఆస్పదం లేదు. స్థితోస్మి గత సందేహః.
సందేహాలన్నీ నివృత్తి అయినా యంటే ఇక తన ధర్మాన్ని తాను పాటించ వచ్చు మానవుడు. ప్రస్తుత మర్జునుడు పాటించవలసిన స్వధర్మ మేమిటి. కౌరవులతో యుద్ధం. యుద్ధం చేస్తే పదిమందినీ చంపవలసి వస్తుందేమో తన్నిమిత్తంగా పాపం చుట్టుకొంటుందేమో నని గదా సందేహ మర్జునుడికి. అది ఆత్మజ్ఞానంతో తీరిపోయింది. చచ్చేది శరీరమే అది కేవల మసత్కల్పం - పోతే ఆత్మ అనేది అలా చచ్చేది కాదది నిత్య సత్యం-అని గదా గ్రహించాడతడు. ఇక సందేహ మేముంది. స్వధర్మమైన సంగ్రామాన్ని సాగించటాని కాక్షేపణే లేదు. కనుకనే అంటున్నాడు కరిష్యే వచనమ్ తవ అని. హత్వాపి ఇమాన్ లోకా సనే భగవ ద్వచన మతడికి బాగా మనసుకు పట్టి ఉండవచ్చు. అయితే ఇదంతా గురుప్రసాద లబ్దమని మరలా విన్నవించటంలో శిష్యుడి కుండవలసిన వినయ సంపత్తీ-గురు ముఖంగా లభించని విద్య ఫలించదనే సంప్రదాయ రహస్యమూ-కొట్టవచ్చినట్టు ధ్వనిస్తున్నాయి.