ఉత్తరార్ధమ్
100
జ్ఞానేను తదజ్ఞానం-యేషాం నాశిత మాత్మనః
తేషా మాదిత్యవత్ జ్ఞానం - ప్రకాశయతి తత్పరం 5-16
అయితే ఈస్మరణ మనేది అందరికీ దక్కేసొమ్ముకాదు. ఎవరో పుణ్యాత్ములైన పెద్దలే ఒకరిద్దరో నోచుకొంటారుదానికి. అలాంటి పుణ్యాతిశయం పూర్వార్జిత మైనది ఇంతవరకూ లేకపోతే ఇప్పుడైనా ఆర్జించటానికి ప్రయత్నించాలి. సాధ కడు. ప్రయత్నించి పోగుచేస్తూపోతే ఒకానొక జన్మలో వీడూ అలాంటివాడే అవుతాడు.
అయినందు కేమిటి గుర్తు. జ్ఞానమునేది ముమ్మరంగా అలవడాలి, అది అజ్ఞానాన్ని ఇక తలఎత్తకుండా చేస్తుంది. మా కలవడిందని ఊరక డప్పాలు కొట్టవచ్చు కొందరు. అది కేవలం వాచా వేదాంతం. నీకది నిజంగానే అలవడిన నాడిక అంధకార మనేది కనిపించరాదు. నామరూపాలే అంధకారం. అది కప్పి ఉన్నఁత వరకూ అంతటా ఉన్నా తత్త్వం నీ అనుభవానికి రాదు. రావా లంటే జ్ఞానమనేది కోటి సూర్య ప్రభా భాసమానంగా ప్రకాశించాలి. సూర్య ప్రకాశంలో అంధకారమెలా మటుమాయ మవుతుందో అలాగే నామరూపాలనే తమస్సుకూడా మటుమాయమవుతుంది. అప్పుడంతవరకూ మరుగుపడిన తత్త్వమా వెలుగులో మనకెక్కడబడితే అక్కడే సాక్షాత్కరిస్తుంది.