#


Back

బాహ్యమే. దాని నెప్పుడూ ఆ ప్రతి బింబ మంట బోదు. అలాగే సర్వత్రా పరచుకొని ఉన్న తన ఆత్మలోనే జరగవచ్చు ప్రతి ఒక్క పనీ. అలా జరిగినా ఆ రూపాలుగానీ వ్యవహారం గానీ శుద్ధమైన అతని ఆత్మ చైతన్యాన్ని ఏ మాత్రమా అంటదు.

ఇందులో ఉన్న చమత్కార మేమంటే పనులు చేసేవీ ప్రకృతి గుణాలే. పనులూ ప్రకృతి గుణాలే. గుణాలే గుణాలతో లావాదేవీ పెట్టుకొని సతమత మవుతున్నాయి నిత్యమూ. గుణా లంటే అహంకారమూ - మనసూ-ప్రాణమూ -వీటి దగ్గర నుంచీ గుణాలే. తానో వీటికి కూడ అతీతమయిన ఆత్మ చైతన్యం. అది నిర్గుణం కాబట్టి ఆకాశంలాగా కదిలేది కాదు. చేసేదికాదు కనుకనే చలనాత్మక మయిన కర్మదాని నంటదని చెప్పటం. ఇలాంటి సత్యం తెలిసిన తత్త్వవేత్త కర్మబంధంలో ఎప్పుడూ చిక్కడు. కర్మ అనే కబంధ హస్తాల నుంచి ఎప్పుడూ వాడు ముక్తుడే.

81
నైవ కించి త్కరో మీతి
యక్తామన్యేత తత్త్వవిత్
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్
అశ్నన్ గచ్ఛన్ స్వవన్ శ్వసన్    5-8

82
ప్రలప న్నుత్సృజన్ గృష్ణ- న్నున్మిష న్ని మిష న్నపి
ఇంద్రియా ణీంద్రియార్థేషు- వర్తంత ఇతి ధారయన్    5-9

అసలు తత్త్వవేత్త అయిన వాడేపని చేస్తున్నా నేనేమీ చేయటం లేదనే అను కోవాలి. అలా అనుకో గలిగినవాడే నిజమైన తత్త్వవేత్త. తత్త్వ మంటేఏమిటి. అంతా నా స్వరూప మనే గదా. అలాంటి భావమున్న వాడి కా చేసే కర్మ కూడ పరాయి దెలా అవుతుంది. అది కూడా స్వరూపమే. స్వరూప మయి నప్పుడది నిత్య సిద్ధం. దానినిక చేయట మేమిటి. చేశానను కోవటమే చేయటం. అలా అనుకోడు తత్త్వవేత్త. అనుకో గూడదు కూడా.

ఎప్పుడేమి చేస్తున్నా ఏది చేస్తున్నా ఏమీ చేయటం లేదని భావించడానికే ధారణ అని పేరు. ఏమి చేస్తున్నా అంటే ఏమిటది. శాస్త్రీయమైన కర్మ కాండే

Page 93