#


Back

ఇంత బరువు నెత్తిన పడితే ఆ మనసు మాత్రమెలా భరించగలదు. నైర్మల్యం మాత్రమెలా నిలవగల దని ప్రశ్న వస్తుంది.

వాస్తవమే. అగ్నికెంత దహనశక్తి ఉన్నా ఒక్కసారిగా బస్తాబొగ్గులు తెచ్చి దాని నెత్తిన పడవేయరాదు చప్పుమని చల్లారిపోతుంది. అలాగే శుద్దిచెందే లక్షణం మనసు కెంత ఉన్నా- అది అలవడే లోపలనే పనుల భారం పనికిరాదు.

కనుక పరిష్కార మేమంటే ఒక మోతాదులో చేయాలి ప్రతిపనీ. కర్మల సంఖ్యా తగ్గించుకోవాలి. తగ్గించు కొన్నదికూడా ఎంతో అంతే చేస్తూపోవాలి. ఎంత అనేది తెలుసుకోవటమెలాగ అని ప్రశ్న. అందుకే నియతమని పేర్కొ న్నాడు భగవానుడు. నియతమంటే శరీరధారణ కెంతకావాలో అంతమాత్రమని అర్ధం. శరీర ధారణమంటే బ్రతకటం. బ్రతకటానికి అన్నమూ వస్త్రమూ నివాసమూ ఇవి కనీసమైన అవసరాలా. ఇవి ఎంత హెచ్చులోనైనా ఉండవచ్చు. ఎంత తగ్గులోనైనా ఉండవచ్చు. అందులో ఎంత తగ్గులో తృప్తి పడగలిగితే అంత మంచిది. తన్మూలంగా వాటికోసం ఊరక ప్రాకులాడే శ్రమ తగ్గుతుంది. దానితో మనసుకు శాంతీ-బ్రహ్మాభ్యాసాని కవకాశమూ లభిస్తాయి.

అంతేగాని చేయమన్నారు గదా అని పిచ్చిగా చేయరాదు. మానితే అసలే మానరాదు. అధమపక్షం తనవరకు తానైనా జీవించాలి గదా మానవుడు. అందుకూ బద్దకిస్తే మరి ఒకరికైనా భారమేగదా. అంచేత ఒక మోతాదు తప్పకుండా పనులు చేస్తూపోతే సాధకుడికి ఇటు జీవయాత్రా అటు బ్రహ్మా విచారణా కూడా సాగుతుంది. ఉభయతారక మది.

71
బ్రాహ్మణ క్షత్రియ విశామ్ శూద్రాణాంచ పరంత వ
కర్మాణి ప్రవిభక్తాని-స్వభావ ప్రభవైర్గుణైః   18-41

కర్మలనేవి అసలు లౌకికమనే గాక శాస్త్రం కూడా విధించింది మనకు. నియతమంటే శాస్త్ర విహితమని కూడా అర్ధమే. శాస్త్ర చోదితమైన కర్మలెలా మానుకోగలం లౌకికం లాగా వాటిని కూడా పాటించవలసిందే మానవులు.

మానవులంటే ఒకరు గారు. బ్రాహ్మణులనీ-క్షత్రియులనీ-వైశ్యులనీ-శూద్రు లనీ-నాలుగు వర్ణాల వారున్నారు. ఈ నలుగురికీ నాలుగు రకాలైన కర్మలు నియతమై Fixed ఉన్నాయి. శమదమాదులూ- అధ్యయ నాదులూ-బ్రాహ్మణు

Page 82