#


Back

త్మగా మారటానికి వీలు లేదు. కాబట్టి అప్పుడిక బాధకమనే ప్రసక్తేలేదు. లేకపోతే మరణమే లేదు మానవుడికి.

మరణం లేకపోతే పోవచ్చు. కాని వాడే మవుతాడనే ప్రశ్న రావచ్చు మరలా. వాడేమీ కాడు. వాడంటే కేవల చైతన్య స్వరూపుడే కాబట్టి మొదటినుంచీ ఎలా ఉన్నాడో అలాగే అప్పుడూ ఉండిపోతాడు ఎలా అన్నాడు మొదటినుంచీ. సర్వ వ్యాపకమై పరిశుద్ధమై కూటస్థమైన చైతన్యంగా గదా ఉన్నాడని వర్ణించాము. ఆ తత్త్వాని కెప్పుడూ మార్పనేది లేదు. మార్పు లేకుంటే మరణం లేదు. దానినే పరమ పద మన్నారు. ఇదుగో ఆ పదంలోనే కదలకుండా శాశ్వతంగా ఉండి పోతాడు సాధకుడు.

సాధక గీతాయామ్ పూర్వార్థమ్
సమాప్తమ్
సాధకగీత
***

59
ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా ।
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ॥ 13-24 ॥   6-31

అయితే ఇది అందరూ అందుకొనేది కాదీ ఫలం. నూటికి కోటికి ఏ మహనీయుడికోగాని అబ్బదు. అలాంటి వాడికే జ్ఞాని అని పేరు. జ్ఞాని అయిన వాడు ఆత్మతో ఆత్మను ఆత్మలోనే చూస్తాడు. ఇది చాలా గంభీరమైన మాట. మనమిప్పుడు చెప్పుకొన్న అర్థమంతా ఇమిడి ఉంది ఈ మాటలో.

అంతా ఆత్మేకాబట్టి ఆత్మలోనే చూడాలి ఎక్కడ చూచినా చూచేదికూడా ఆత్మేకాబట్టి ఆ ఆత్మతోనే చూడాలి ఎప్పుడయినా. అలాగే చూడబడేదికూడా అదే కాబట్టి ఆత్మనే చూడాలి ఎవడయినా. అంటే ఏమన్నమాట. చూచేవాడు- చూడబడేది-చూచే పద్ధతి-మూడూ ఆత్మే. చూచేవాడే అంటే అది లోపల. చూడబడేదే నంటే వెలపల. చూడటమంటే ఆరెంటికీ మధ్య. మూడూ ఒక్కటే ననేసరికి లోపల-వెలపల-నడుమ అనేతేడా లేకుండా అంతా కలిసి ఒకేక ఆత్మచైతన్యమని చెప్పినట్టయింది. ఇలా కలిసినట్టే తన స్వరూపాన్నీ ఎవడు పట్టుకొంటాడో వాడే జ్ఞాని. వాడే పూర్ణపురుషుడు.

Page 71