కివన్నీ ఉన్నాయని గాదు. ఆ మాటకు వస్తే ఈ నామరూపాదులేవీ లేవాయనకు. అది నిర్గుణమైన తత్త్వం. ఆ తత్త్వానికి బాహ్యంగా మరేదీ లేదు వాస్తవానికి. అయినా ఏదో ఉన్నట్టు చూస్తున్నాము మనం. తత్కారణంగా దీని కధిష్ఠానమైన Base అ తత్త్వం మనకు బాగా దూరమైపోయింది. ఇప్పుడు దాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ చూచే నామరూపాలన్నీ ఏవో గావు-దాని విభూతే Manifestationనని దాని కారోపించి చూడాలి మనం. చూస్తే ఈ ఉపాధుల మేరకే నిలిచిపోక మన దృష్టి దీనికి విలక్షణంగా దీనికి మూల భూతమైన ఆతత్త్వాన్ని పట్టుకోగలదు. ఇది పాణి పాడాది సావయవమయితే అది నిరవ యవం. ఇది సాకారమైతే అది నిరాకారం. ఇది ఆవృతమైతే అది అనావృత మయి వీటన్నిటినీ ఆవరించింది. ఇది మనకు విషయమయితే అది అవిషయం. ఇలా అనాత్మ ప్రపంచానికి విలక్షణంగా ఆత్మతత్త్వాన్ని మనం జ్ఞప్తికి తెచ్చు కోటానికీ నామరూపాది వర్ణన మనకు తోడ్పడుతూంది. అనేకత్వాన్ని Analy- sis వర్ణించట మప్పటికి ఏకత్వాన్ని Synthesis గ్రహించటానికే నన్నమాట.
56
సర్వేంద్రియ గుణా భాసం - సర్వేంద్రియ వివర్జితం
అసక్తం సర్వభృ చ్చైవ-నిర్గుణం గుణ భోక్తృచ 13-14
ఇంతకూ ఎప్పుడూ ఉన్నదొక పరిపూర్ణ చైతన్యమే. అదే నామరూపాత్మక మైన ప్రపంచంగా తన మాయాశక్తి చేత ఇలా భాసిస్తూ ఉంది. అంచేత మన ఇంద్రియాలూ ఇంద్రియ గుణాలూ వాటి కాశ్రయమైన ఈ శరీరాలూ-వీటికి బాహ్యంగా గోచరించే శబ్దస్సర్శాదులైన విషయాలూ వాటి కధిష్ఠానమైన ఈ ప్రపంచమూ-అంతా దాని ఆభాసే. అంటే అదే ఈ రూపంలో కనిపిస్తూ ఉంది గాని ఇది వేరే ఒక పదార్థంగా ఎక్కడా లేదు.
వేరుగా లేదు గనుకనే దానికి ఈ కరచరణాదులేవో ఉన్నాయని భావించడం కూడా పొరబాటే. వాస్తవంలో దానికి ఇంద్రియాలూ లేవు. ఇంద్రియ గోచరమైన ప్రపంచమూ లేదు. ఇవి ఏవీ లేకపోతే దానికిక దేనితో మాత్రం సంగ మేముంది. దానినిది భరించటమేముంది. రెండవ పదార్థమంటూ ఒకటి ఉంటే గదా. ఆ ఉన్నదని మనం చూచేది కూడా అదే ఆయె. అంచేత అది వాస్తవానికి నిర్గుణం. ఏ గుణాలూ లేవుదానికి. ఐతే చమత్కారమేమంటే ఉన్నట్టుగా కనిపిస్తాయవి. అది దాని యోగమాయా విలాసమే గాని మరేదీ కాదు.
Page 68