జ్ఞేయమని పేరేగాని చివరకది కూడా జ్ఞానవివర్తమే. కాబట్టి సద్రూపమైన జ్ఞానం కన్నా వేరుగాదు. అలాంటప్పుడిక బ్రహ్మతత్త్వాన్ని సదసద్రూపంగా పేర్కొన టంలో తప్పేముంది. అయితే ఎంతవరకంటే సత్తనేది దాని అసలు తత్త్వమైతే అసలైన ఈ జ్ఞేయ ప్రపంచమంతా దాని విభూతి. అంతేతేడా.
55
సర్వతః పాణిపాదం త-త్సర్వతోక్షి శిరోముఖం
సర్వతః శ్రుతిమ ల్లోకే - సర్వ మావృత్య తిష్ఠతి|| 13-13
ప్రపంచమంతా దాని విభూతి అని ఎప్పుడన్నామో అప్పుడు దానికొక నామమూ— ఒక రూపమూ- ఒక క్రియా- ఇవి మూడూ వచ్చి పడ్డాయి. నామ రూపక్రియ లనేవి వాస్తవంలో లేవు పరమాత్మకు. కాని మనకవి నిత్మమూ దర్శనమిస్తున్నాయి. పరమాత్మతప్ప మరొక్క పదార్ధమే లేనప్పుడివి ఎక్కడివి. ప్రపంచాని వంటావా. అసలు ప్రపంచమే లేదుగదా. మరి దేనివివి అని ప్రశ్న.
ఇది చాలా చిత్రమైన విషయం. బ్రహ్మతత్త్వం తప్ప మరొక్కటి లేదు. ఉన్నది ఒక్కటే. పోతే దానికితోడు ఈ నామరూపాలనేవి కనిపిస్తున్నాయి. కనిపించే వాటిని కాదనలేము. అలాంటప్పుడివి దేనివై ఉండాలి ఈ నామ రూపాలు, ఆ బ్రహ్మానివే అయి ఉండాలి సందేహం లేదు. అంటే అప్పటికే మన్న మాట. మన మిప్పుడు నామరూపాలని ఏవి మనచుట్టూ పరచుకొని ఉన్నట్టు చూస్తున్నామో అవి ఈ ప్రపంచానివి కావు. ప్రపంచమనేది వేరే ఒక పదార్ధముండి దానికి నామరూపాలంటూ లేవు. బ్రహ్మం తాలూకు నామ రూపాలనే ప్రపంచానివిగా భ్రమిస్తున్నాము మనమంతా. అది కేవలం మన భ్రమే. ఎలాంటిదంటే ఇది-మృత్తిక తాలూకు నామరూపాలనే ఘటం తాలూకు వంటూ చూడటం లాంటిది. మృత్తికకు భిన్నగా ఘటమెక్కడ ఉంది. మృత్తిక రూపమే వాస్తవానికి ఘటమనేది. అలాగే పరమాత్మ రూపమే ప్రపంచమనే పేరుతో మనకు కనిపిస్తూ ఉంది.
దీనినిబట్టి పరమాత్మకు కండ్లూ ముక్కులూ చెవులూ కాళ్ళూ చేతులూ ఇలా చిలవలు పలవలు పెట్టి వర్ణించారంటే అది సమంజసమే. ప్రపంచమంతా ఆయన రూపమే అయినప్పుడందులో ఉండే అన్ని హంగులూ ఇక ఆయనవే గదా. ఆయనవే ఇవన్నీ అని చెప్పటంలో ఏమిటి ఉద్దేశ్యం నిజంగా ఆయన
Page 67