అది కలిగేంత వరకే అన్ని ప్రయత్నాలు. కలిగిన తర్వాత ఇక యత్నం కాదు. ఫలితమే అది ఎలా ఉంటుందని అడిగితే మోహాని వృత్తే అది మోహ మంటే అనాది ప్రవృత్తమైన మానవుడి అజ్ఞానం. దానివల్లనే ఈ సంసార బంధం. తపస్సు లాంటిదది. అది ఈ బ్రహ్మ భావమనే తేజస్సు ముందు విలువ లేక దాని లోనే లీనమైపోతుంది. అప్పుడంతా బ్రహ్మమే. మరొక పదార్ధమే లేదు.
మరొకటి లేకుంటే ఇక ఆభావానికి చలనమంటూ ఉండబోదు. జీవితం లోనూ ఉండదు. మరణంలోనూ ఉండదు. మరణం కూడా చలనమే గదా. జీవుడు చలించి బయటికి పోవటాన్నే మరణ మంటున్నాము. దేశ కాలాదులన్నీ నా స్వరూపమే అని భావించిన బ్రాహ్మీ స్థితిలో అది ఎలా సంభవం. కాబట్టి అంతకాలంలోనైనా ఆ స్థితిలో ఉన్న వాడికంతమే లేదు. అనంతమైన నిర్వాణ సుఖాన్నే చూరగొంటాడు. శరీర మున్నప్పుడు జీవన్ముక్తి రూపమయితే అది- శరీరం తొలగినప్పుడు విదేహముక్తి. అంతే తేడా. మరేమీ లేదు.
48
అంత కాలేపి మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం
యఃప్రయాతి సమద్భావం- యాతినాస్త్యత్ర సంశయః 8-5
అయితే ఇక్కడ ఒక అశంక. అంతకాలమంటున్నారు. మరలా చలనం లేదంటున్నారు. చలనం లేదన్నప్పుడది అంతమెలా అవుతుంది. అంతమయితే చలనమెలా లేకపోతుంది. చూడబోతే విప్రతి షిద్దంగా Contradictory ఉన్నదీ వాక్యమని ప్రశ్న వస్తుంది. దానికి మరలా సమాధానమిస్తున్నది శాస్త్రం.
ఇందులో విప్రతి షేధ మేమాత్రమూ లేదు. ఎందుకంటే అంతమని చెప్పింది మేము సాధకుడి ఆత్మకుకాదు. ఆత్మగా భావించే శరీరానికి. జ్ఞానోదయం కాగానే ప్రారబ్దావసానంలో దానినక్కడే వదలి వేస్తాడు సాధకుడు. మరి ఆత్మ కంతమే లేదు. కాబట్టి సాధకుడి స్వరూపమే కాబట్టి అలాగే నిలిచి ఉంటుందది. ఇక్కడ ఉన్న విశేషమేమంటే మామూలుగా లౌకికుల నందరినీ అవసానంలో శరీరమే వదలి పోతుంది. సాధకుడి విషయ మలాగాదు. ఆపాటికి వాడు సిద్ధుడయి ఉంటాడు కాబట్టి అతణ్ణి శరీరం వదలడం కాదు. అతడే శరారాన్ని వదలి వెళ్ళుతాడు. అంటే ఎక్కడికో పోతాడని కాదు మరలా శరీరాదు లను కూడా బ్రహ్మంగానే భావించి అలాగే నిలిచి ఉంటాడని భావం.
Page 60