#



అంచేత మానవుడికున్న ఈ అజ్ఞానానికి ఆది అంటూ లేదు. అదే కారణ శరీరమన్నారు. శాస్త్రజ్ఞులు. కారణం గనుకనే తన్మూలంగా జీవుడి కీజన్మ లేర్పడు తున్నాయి. ప్రతి జన్మలోనూ కామ ప్రేరితుడు కావటం మూలాన ఈ జీవుడు పాప కర్మలు చేస్తుంటాడు అవి అంతకంతకు ప్రబలమై జన్మ పరంపర అనేది తామర దంపరగా సాగుతూపోతుంది ఇదే సంసారం.

దీని నెప్పటికయినా సరే- మనం తెంచుకొని బయట పడాలంటే పుణ్య కర్మలే చేస్తూ పోవాలి. పుణ్యం పాపానికి ప్రతిద్వంద్వి Opposite కదా. ఎంత పాపం పెరిగిపోయిందో అంత పూణ్య మాచరించగలిగితే చాలు. ఇది దాన్ని కూకటి వేళ్ళతో సహా పెళ్ళగిస్తుంది. దానితో రజస్తమో మాలిన్య మడుగంటి సత్త్వం పరిశుద్ధ మవుతుంది మానవుడికి. సత్త్వశుద్ధి నార్జిస్తే ఇక ద్వంద్వాలకు ప్రసక్తిలేదు. పదవిని కోలుపోయిన ప్రభువులలాగా అవి వెంటనే పలాయనం చిత్తగిస్తాయి. అప్పుడీ విషవలయాన్నుంచి బయటపడి జీవుడు భగవత్తత్త్వాన్ని గట్టిగా పట్టుకో గలుగుతాడు.

కాబట్టి ఇంతకూ పిండితార్ధ మేమిటి ఇది ఎక్కడిదీ- ఎందుకూ అనే ప్రశ్న లతో కాదు సాధకుడు కాలం గడపవలసింది. దాని బదులు ఇది ఎలా నిర్మూల మవుతుంది అనే విచారణ సాగించాలి. ఎందుకు అనేది లౌకికుని స్థాయి. ఎలాగ అనేది సాధకుని స్థాయి. లౌకికుని స్థాయిలో పరిష్కారం లేదు. ప్రశ్న ప్రశ్నగానే నిలిచి పోతుంది. పరిష్కారమే కావాలంటే సాధకుని స్థాయికి ఎద గాలి. అది ఎలా పోగొట్టుకోవాలనే ప్రయత్నం సాగిస్తూపోతే యత్నం ఫలించే సరికి ఇక ఎందుకనే ప్రశ్నరాదు. దానికి కూడా అందులోనే సమాధానం దొరుకు తుంది మనకు.

46
జరా మరణ మోక్షాయ-మా మాశ్రిత్య యతంతి యే
తే బ్రహ్మతద్విదుః కృత్స్న-మధ్యాత్మం కర్మ చాభిలం   7-29

అయితే ఇంత శ్రమపడి అయినా ఆ భగవత్తత్త్వాన్ని పట్టుకోవలసిన అవ సరం ఏమిటి. స్వాభావికమైన జీవభావం తోనే ఉంటే సరిపోలేదా అని మరలా పూర్వ పక్షం చేయవచ్చు. జీవభావం మనకు సుఖదాయకమైతే మంచిదే. ప్రాకులాడ బనిలేదు. కాని అది ఉన్నంతవరకూ సుఖమనే వాసనే లేదు మనకు. అడపా దడపా ఏదో

Page 58