గాని దానిని వారు ఎలా ఉందో అలా పట్టుకోలేక పోతున్నారు. వారు పట్టుకొన్న ఆత్మ భూతాత్మ-దేహాత్మ- విజ్ఞానాత్మ మాత్రమే. ప్రత్యగాత్మ గాదు. అందుచేత మహాత్మ అనే స్థాయికి వారు రాలేదు.
దీనిని బట్టి జ్ఞాన మొక్కటే సంసార తారకమనీ అది కూడ పరోక్షం కాదు- అపరోక్షంగా అనుభవానికి వచ్చేదని స్పష్ట మయింది. అలా అపరోక్షంగా అనుభవానికి రావాలంటే అది ఎన్నో జన్మల నోము ఫలమని కూడా అవగత మయింది ఇలాంటి పరాకాష్ట Summit నందుకొన్న వాడెవడు. వాడెక్కడ ఉంటాడు సుదుర్లభః దుర్లభ అంటేనే చాలు చాలా అరుదని చెప్పటానికి. సుదుర్లభః అట. అంటే అరుదుగానైనా అసలు కనిపిస్తాడో లేదో చెప్పలేము. ఇది ఆత్మ జ్ఞానమనేది ఎంత అపురూపమైనదో దాని మహత్త్వాన్ని వర్ణించటానికి చెప్పిన మాటే గాని అలాంటివాడసలెక్కడా ఉండడని కాదు. అంతే కాదు. అంత అపురూపమైంది గనుకనే వజ్రవైడూర్యాదుల లాగా దాన్ని పట్టుకోటానికి మానవు డితోధికంగా కృషి చేయాలని కూడా ఒక ప్రబోధమే ఇది.
37
కామై సై సైర్హత జ్ఞానాః - ప్రపద్యంతే న్యదేవతాః
తంతం నియమ మాస్థాయ-ప్రకృత్యా నియతాస్స్వయా 7-20
ఇలాంటి ప్రబోధాన్ని అందుకొని అలాంటి అఖండ జ్ఞానాన్ని అనుభూతికి తెచ్చికోటానికెంతో సుకృతం చేసి ఉండాలి. లేకుంటే మనం చేసిన దుష్కృత మెలాగూ ఉండనే ఉన్నది. అది ఊరక ఉండేది కాదు. అనుక్షణమూ కామాన్ని రెచ్చగొడుతుంది. ఆ కామ భుజంగం సహస్ర ఫణాలు విప్పి మన జ్ఞానాన్ని కబళిస్తుంది. దానితో మనకు సర్వమూ వాసు దేవుడనే బుద్ధి నశిస్తుంది. ఒకే ఒక తత్త్వాన్ని భిన్న భిన్న రూపాలుగా దర్శిస్తాము. ఒక్కొక్క రూపాని కొక్కొక్క దేవత అని నామ కరణం చేస్తాము. ఆ దేవతల నడిగి కోరికలన్నీ తీర్చుకోవాలని తాపత్రయ పడతాము. అయితే ఈ దేవతో పాసన కూడా అంత సులభం కాదు. ఒక్కొక్క దాని కెన్నో నియమాలూ నిష్టలు ఉంటాయి. ఉన్నా ఫరవాలేదు. ఫలకామన బలంగా ఉండడం మూలాన ఆక్లేశం కూడా వహిస్తాడు మానవుడు. ఈ సహన శక్తి అతడికి సహజంగా ఉన్న ప్రకృతే నేర్పుతుంది.
Page 51