#


Back

పోతే గదా. అవే దేవాది జాతులకు ప్రతీకలు Symbols. వీటి మూటినీ నిర్మూలించు కోటానికి దమ దాన దయా గుణాల నభ్యసిస్తూ పోమ్మని మనకు చేసిన బోధే ఇదంతా. ప్రతి సంవత్సరమూ వర్షర్తువులో మేఘం “ద ద ద” అని గర్జిల్లటంలో కూడా ఈ దమదాన దయలే ధ్వనిస్తున్నా యంటుం దుపనిషత్తు. ఆ శబ్దం వినేది మానవుల మైన మనమే గదా. కాబట్టి మనకే ఈ సందేశం. మరెవరికీ గాదు.

ఈ సందేశాన్ని అందుకొని దమాది గుణాల నల పరుచుకొని క్రమంగా సత్త్వరజస్తమో గుణాల ఫలితంగా ఏర్పడిన ఈ కామ క్రోధాదులను దాటి పోయామా - త్రిగుణా తీతులమై గుణాతీతమైన ఆ పరమాత్మ తత్త్వాన్నే మన స్వరూపంగా అనుభవానికి తెచ్చుకోగలం. తద్వారా మృత్యువునే జయించ గలం. లేదా వాటికి బానిసలమై వాటి ఉక్కు కోరలలో చిక్కి శాశ్వతంగా ఆత్మ వినాశాన్ని కోరి తెచ్చుకోగలం. ఆత్మకు వినాశ మేమిటని ఆశ్చర్య పడరాదు. దాని అస్తిత్వాన్ని మరచి పోవటమే దాని వినాశం. వినాశమంటే పోగొట్టుకోట మని గదా అక్షరార్థం. ఉన్నా గుర్తించక పోతే అది దాన్ని పోగొట్టు కోటమే. మెడలో ఉన్న గొలుసు ఉన్నదని గుర్తించ లేక ఇక్కడా అక్కడా వెతుకుతూ కూచున్నంత వరకూ అది మన పాలిటికి లేనిదే. అంచేత ఇలాంటి అనర్థం నుంచి బయట పడాలంటే దానికి మూల కారణమైన త్రిగుణాల సంపర్కానికి తిలాంజలి ఇవ్వాలి.

30
దైవీ హ్యేషా గుణమయీ - మమ మాయా దురత్యయా
మా మేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే    7-14

సరే. బాగానే ఉంది. కాని ఈ గుణాలని చెబుతున్నారే ఇవి ఎక్కడివి. ఉన్న దొక్క పరమాత్మ చైతన్యమే గదా. అదే సర్వ వ్యాపక మని గదా వర్ణించారు. అలాంటప్పుడీ గుణా లేమిటి వీటి వల్ల మన బుద్దులు కలుషితం కావట మేమిటని ప్రశ్న. వాస్తవమే. చైతన్యం తప్ప మరేమీ లేదు. కాని చైతన్య మనేది అశక్తమైనది కాదు. దాని కొకశక్తి ఉన్నది. అది దాని లాగే సర్వత్రా వ్యాపించి ఉన్నది. అయితే చైతన్యం వస్తువు. ఇది దాని ఆభాస. వస్తువు నాధారం చేసుకొని ఉండ వలసిందే గాని అది స్వతంత్రంగా ఉండలేదు. అగ్నికి ఉష్ణ గుణ మనేది

Page 41