#


Back

న్నాము. అది అక్కడే వుంది. అయితే నీటి పొరలలాగా త్రిగుణాలనే తెరలు దానికడ్డు తగిలాయి. అందుకే కనపడటం లేదు.

29
త్రివిధమ్ నరక స్వేదమ్ - ద్వారమ్ నాశన మాత్మనః

త్రిగుణాలంటే సత్త్వ రజస్త మస్సులని గదా పేర్కొన్నాము. ఇవి ప్రతి వ్యక్తి లోనూ వాటి ప్రభావం చూపుతూనే ఉంటాయి. మనలో చోటుచేసుకొని నిత్యమూ మనలను పీడించే గర్భశత్రువులు మూడున్నాయి. ఒకటి కామం, మరొకటి క్రోధం. వేరొకటి లోభం. ఇవి మూడూ ఏవో గావు. ఆ గుణాల తాలూకు దుష్పరిణామమే. ఇందులో సత్త్వ ప్రభావం వల్ల ఏర్పడింది కామమైతే -రజ: ప్రభావంవల్ల లోభమైతే తమోగుణం మూలంగా జనించింది క్రోధం. అవి మూడూ జీవితాంతమూ సరాసరిమనలను నరకానికే చేరుస్తాయి. నరక ద్వారాలివి. మామూలుగా అవి మూతపడి ఉంటాయి. ఈ కామాదులకు దాసు లమై ఏమరు పాటుతో ఉన్నా మంటే మాత్రం ఎప్పుడూ మన పాలిటి కవి తెరవబడే వుంటాయి. మరణానంతరం వాటి ద్వారా నిరయంలో ప్రవేశించకా తప్పదు. అసి పత్ర రౌరవాది సరక దుఃఖాల సనుభవించకా తప్పదు.

అంచేత వాటి బారినుంచి తప్పించుకోవటానికే ఎప్పటికైనా మానవుడు ప్రయత్నం చేయాలి. అలా చేయాలంటే ఏమి చేయాలి మనం. కామక్రోధాదు లను దూరం చేసేకోవాలి. వాటినెలా దూరం చేయాలి. వాటి శత్రుపులేవో వాటిని మనం మిత్రులను చేసుకోవాలి. వాటి శత్రువులు వరుసగా కామానికి దమం. లోభానికి దానం. మరి క్రోధానికి దయ. ఒకప్పు డీమూడింటినీ అల వరచుకొని బ్రతుకండని బ్రహ్మ దేవుడు దేవ మానవదానవులకు ముగ్గురికీ బోధించి పంపాడట. దేవతలు మామూలుగా కామలోలుపులు. కాబట్టి వారికి ఇంద్రియ నిగ్రహ రూపమైన దమ మవసరం. మానవులు సాధారణంగా లోభ గ్రస్తులు. ఎంత ఉన్నా తృప్తిజెందని స్వభావం మనది. కనుక దానికి విరుగుడుగా దాన మలవరచుకోవాలి మానవుడు. పోతే ఇక రాక్షసులు క్రోధైక పరాయణులు. నిష్కారణంగా పరులను బాధించటమే వారి స్వభావం కాబట్టి దానికి చేయ వలసిన చికిత్స దయాగుణం.

ఆ మాటకు వస్తే ఈ దేవ దానవ మానవు లెక్కడో లేరు. మానవులలోనే ఉన్నాయి వాస్తవాని కీమూడు తరగతులూ. కామ క్రోధ లోభాలు మనలో లేక

Page 40