#


Back

వచ్చీ పోయి ఇలాంటి తోమకమే పెట్టవలసి ఉంటుంది. పెట్టే కొద్దీ మనసు కూడా వన్నె మారి తన సహజరూపంతో ప్రకాశిస్తుంది. అంతేకాదు. ఏదైనా ఒక పాత్ర తోమేటప్పుడు చేయి రెండు వైపులా పోతుంది. ఒక వైపే అయితే అది సరిఅయిన తోమకం కాదు. అలాగే మనసును శుద్ధి చేసేటప్పుడు కూడా ఇరువైపులా చేయవలసి ఉంటుంది శుద్ది. ఒకటి నేతి అని అనాత్మ దృష్టిని నిరాకరిస్తూ పోవడం. వేరొకటి అలా నిరాకదించినదంతా మరలా మన ఆత్మస్వరూపమేనని అనుసంధానం చేసుకుంటూ రావడం. ఒకటి ప్రసంఖ్యానమనీ - మరొకటి ప్రవిలాపనమనీ చెబుతారు శాస్త్రజ్ఞులు. మొత్తానికీ రెండూ కలిసి శోధనమనే ప్రక్రియను పూర్తిచేస్తాయి. దానితో బాగా పరిశుద్ధ మవుతుంది మానవుని మనస్సు. అప్పుడిక దానికి మనసనే పేరు లేదు. అది ఆత్మే అవుతుంది.

అయితే ఇది అంతసులభంగా జరిగే పనిగాదు. ఒక జన్మలో తెమిలే వ్యవ హారంకూడా కాదు. దానిని సాధించే లోపల మానవుడనేక జన్మ లెత్తవలసి ఉంటుంది. అలా చెప్పటంలో కూడా ఆశ్చర్యపడనక్కర లేదు. ఎంతో కర్మ మిగిలిపోయే కొంత కర్మవల్ల ప్రస్తుత మీ జన్మ ఏర్పడింది మనకు. ఇందులో మరలా చేస్తూనే ఉన్నాము కర్మ. అమిగిలి పోయిందీ ఇదీ కలిసి ఇంకా ఎన్నిజన్మ లివ్వాలో మనకు. అయితే సాధన చేసేకొద్దీ కర్మ కొంత తరిగిపోవచ్చు. సందేహంలేదు. కాని ఏమి సాధన. సముద్రం మాదిరి కర్మ ఉంటే అందులో ఒక బిందువు మాదిరైనా లేదు మనసాధన. ఇలాంటి బిందువు లెన్ని చేరితే సముద్రమయ్యేది.

కనుకనే ఎన్నో జన్మలు పడుతుందని చెప్పటం. ఒక్కొక్క జన్మలో కొంత కొంతపోగు చేస్తూపోతే ఒకానొక జన్మకది కొండలాగా పెరిగిపోతుంది. దానితో అంతవరకూ కొండలాగా పెరిగిన కర్మఅంతా కరిగిపోతుంది. కర్మ పూర్తిగా తొలిగిపోతే ఆ ఖాళీని క్రమంగా జ్ఞానమే ఆక్రమిస్తుంది. అప్పుడు ఇక జన్మలేదు. పునరావృత్తి రహితమైన పదాన్నే మన మందుకోగలం.

27
మనుష్యాణాం సహస్రేషు-కశ్చి ద్యతతి సిద్ధయే
యతతా మపి సిద్ధానామ్-కుశ్చి న్మాం వేత్తి తత్త్వతః    7-3

Page 37