#


Back

అన్నీ ఉన్నాయనే సామెతే అవుతుంది. ప్రస్తుత మిలాంటి సౌకర్యాలన్నీ మన కబ్బినందుకవి మనకు ఉపయోగపడతాయా, పడతాయని. ఏమి నమ్మకం అని మరలా ప్రశ్న.

పడతాయనే చెబుతున్నాడు పరమాత్మ. యోగభ్రష్టుడే వాతావరణంలో జన్మించినా వాడికా వాతావరణాన్ని ఉపయోగించుకునే బుద్ధిబలం కూడా జన్మ తోనే వస్తుంది. జన్మతోనే వస్తుందంటే ఎప్పటిదది. ఇంతకు ముందు జన్మల తాలూకు సంచితం. దాని సంస్కార మెక్కడికీ పోడు. ఎన్ని జన్మలు గడచినా అది వాడికి మాత్రమే హక్కుభుక్తం. తన్మూలంగా పూర్వ మెలాటి బుద్దిబల ముందో మానవుడి కదే ఇప్పటి జన్మలోకూడా తటస్థ మవుతుంది.

అంతేగాదు. ఆ బలంతో వాడిప్పుడంతకన్నా ఎక్కువగా ప్రయత్నం సాగి స్తాడు. అలా సాగించినప్పుడే అంతకంతకు ముందుకుపోగలడు సాధకుడు. లేకపోతే పాతరలో ధాన్యం లాగా ఎంత పోగుజేస్తే అంతటితోనే నిలిచిపోయే ప్రమాచ మున్నది. కాబట్టి జన్మాంతరంలో చేసుకొన్నది కొంతా-దాని ఆసరాతో మరలా మనం సాగించేది కొంతా-రెండూ కలిసి సాధన పెరుగుతూ పోతుందని భావించాలి మనం. ఒకటి అసలైతే మరి ఒకటి దానిపైన పెరిగే వడ్డీ లాంటిది.

26
ప్రయత్నా ద్యత మానస్తు-యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధ - స్తతో యాతి పరాం గతిమ్   6-45

మొత్తం మీద అదేపనిగా ప్రయత్నం చేస్తూ పోతే కొంతకాలానికి శుద్ధి అనేది ఏర్పడుతుంది. చిత్తానికి పట్టిన కల్మషం తొలిగి పోవటమే శుద్ది. కిల్బిషమంటే ఏమిటది. నిరంతర విషయ చింతన వల్ల మనసుకు కలిగే ఉపరాగం Impression దానిచే ఉపరక్తమైన మనస్సు మసి పట్టిన కాగుమాదిరి తయారవుతుంది. కాగు రాగిదు. కాని ఏమి సుఖం. ఎప్పుడూ నల్లగా కందెనలాగా కనిపిస్తుంటుంది. సహజమైన దాని ఎర్రదనం ఎప్పుడూ మనకు దృగ్గోచరం గాదు. అది ఆ నల్లని మసిపూత క్రిందబడి మటు మాయ మయింది. అది ఇప్పుడు మరలా తన సహజమైన కాంతితో మనకు కనపడాలంటే దానికి మనం బాగా పులికాపు పెట్టాలి. రెండు చేతులతో పట్టి గట్టిగా తోమాలి. తోమే కొద్దీ నలుపు విరిగి ఎఱు సెక్కుతూ వస్తుందది. మన మనసుకు కూడా

Page 36