అలాగే యోగికి ఎంతో స్పష్టంగా సూర్యరశ్మిలో మాదిరి కనిపించే ఆ బ్రహ్మ తత్త్వం గుడ్లగూబ లాంటి దృష్టి గల లోకుల కేమాత్రమూ అంతుపట్టటం లేదు. గుడ్లగూబకు సూర్య తేజస్సే తమస్సు లాగా భాసించినట్టు మనందరికీ ఆ బ్రహ్మ చైతన్యమే అచేతనమైన జగత్తయి కూచుంది.
పోతే ఇక మన మందరమూ పగలని ఏది చూస్తామో అది బ్రహ్మవేత్తకు రాత్రి అట. ఏమిటి దీని కర్థం. పగలంటే ఇక్కడ నిజంగా వగలు గాదు. మనం పగలని భ్రమ పడుతున్నది. అది ఏదో గాదు. ఈ నామ రూపాత్మకమైన ప్రపం చమే. ఇది మన చుట్టూ పరచుకొని కనిపిస్తుంటే నిజంగానే ఉందని చూస్తు న్నాము. అది కనిపిస్తూ మనం చూస్తూ ఉన్నాము కాబట్టి పగలనే మన భావం. ఇది పగలు గాదు. నిజంలో రాత్రి అంటే మన ముందనుకొని చూచే ఈ చరాచర దృశ్యాలు వాస్తవంలో లేవక్కడ. లేని ప్రపంచాన్నే మన అజ్ఞానం వల్ల ఉన్నట్టు దర్శిస్తున్నాము. దానితో వ్యవహరిస్తున్నాము. ఇది ఎలాంటిదంటే ఒక స్వప్న దృక్కు అనుభవం లాంటిదన్నారు భాష్యకారులు. స్వప్నంలో మనమెన్నో చిత్ర విచిత్ర దృశ్యాలు చూస్తుంటాము. ఎంత మందితోనో వ్యవహ రిస్తుంటాము. అదంతా తాత్కాలికంగా పగలే మనకు. అంత మాత్రాన అది యథార్థమైన పగలు కాదు గదా. రాత్రినే పగలుగా భావించి చూస్తున్నాడు. స్వప్న దృక్కు వాడిలా చూస్తున్నా ప్రక్కనే మేలుకొని ఉన్న వేరొకడి కది రాత్రి కాలమే. పగలు గాదు. ఇక్కడ కలగనే వాడికి రాత్రే పగలైనా మేలుకొని చూచే వాడి కది ఎలా రాత్రి కాలమో అలాగే అజ్ఞాని ప్రపంచమని చూస్తున్నది జ్ఞాని కదంతా బ్రహ్మమే.
దీనినిబట్టి తేలిందేమంటే జ్ఞానికి బ్రహ్మమూ బ్రహ్మమే. ప్రపంచమూ బ్రహ్మమే. అజ్ఞానికి బ్రహ్మమూ ప్రపంచమే. ప్రపంచమూ ప్రపంచమే. అంటే జ్ఞాని కహోరాత్రాలు బ్రహ్మే కనిపిస్తుంటే. అజ్ఞానికి ప్రపంచమే కనిపిస్తున్నదని అర్థం. ఇందులో బ్రహ్మాన్ని ప్రపంచంగా చూస్తున్న మన బోటి లోకులది వియోగమైతే ఈ సమస్తమూ బ్రహ్మతత్త్వంగా దర్శించే జ్ఞానిది నిజమైన యోగం. అప్పుడిక నామ రూపకృతమైన వైవిధ్యమే Diversity లేదు కాబట్టి అదే సమత్వం. సామ్యం. ఈ కనిపించే చరాచర పదార్థాలలోనూ పరచుకొని ఉన్నదదే. అదే ఇవన్నీ వాస్తవానికి. అది మన స్వరూపమే. దానిని పట్టుకొని మన స్వరూపమని భావించినప్పుడే మనకు మోక్షం.
Page 25