ఏదో ఒకటి కొంటాము. వెళ్ళిపోతాము. చూడండి. ఇక్కడ మొదట చూపులో శాంతిలేదు. రెండవ దానిలో ఉంది. ఏమి కారణం. నామరూపాలనే చూచేసరి కేబట్ట కాబట్ట విశిష్టంగానూ విలువైనది గానూ కనిపించి మనసుకు విభ్రాంతి కొలిపింది. దానికి భిన్నంగా అన్నింటిలోనూ ఒకే స్వరూపాన్ని ఒకే ప్రయోజనాన్ని ఎప్పుడు చూచామో అప్పుడన్నీ వస్త్రంగానే భాసించి ఇందులో ఏదైనా ఒకటేననే తృప్తి నిచ్చింది. దీనిని బట్టి ఏకత్వాన్ని దర్శిస్తూ పోవట మొక్కటే శాంతి దాయకమని అర్థమయింది. అలాంటి ఏకత్వం పిపీలికాది బ్రహ్మ పర్యంతమూ ఒకే ఒక ఆత్మ చైతన్యం తప్ప మరొకటి లేదని ఇంతకు ముందే చాటించాము. ఆ చైతన్యం కూడా ఎక్కడో లేదు. అది మన స్వరూపమే. అలాంటప్పుడిక మనకు భయ మేమిటి. మన స్వరూపం మన దగ్గరే ఉంది. మనమే. మన చూపే. ఆ చూపుతో మనం నిత్యమూ చూడగలిగితే చాలు. ఏది చూచినా- ప్రమాదం లేదు. ఆ చూపే మనల నొక అంగరక్షకుడి లాగా కాపాడుతూ పోతుంది. ఆయా కార్యాలు మనం నిర్వర్తిస్తున్నా వాటన్నిటినీ మనం బ్రహ్మాకారంగా మారుస్తూ పోతే అది పరమ శాంతిని మనకు ప్రసాదిస్తుంది.
14
యా నిశా సర్వభూతానామ్- తస్యామ్ జాగర్తి సంయమీ
యస్యామ్ జాగ్రతి భూతాని- సానిశా పశ్యతో మునేః 6-69
ఈ ప్రకారంగా సమస్త ప్రపంచాన్నీ తమ శరీర మన, ప్రాణాదులతో సహా బ్రహ్మాకారంగా మార్చుకొని దర్శిస్తూ పోవటమే నిజమైన యోగం. యోగమంటే కలయిక అని అక్షరార్థం. రెండు విజాతీయ భావాలున్నంతవరకూ కలయిక అనేది ఏర్పడదు, తాత్కాలికంగా కలిసినట్టు కనిపించినా ఎలా కలిశాయో అలాగే విడిపోగలవు. సంయోగ ముందంటే వియోగం కూడా ఉండి తీరుతుంది. తిల తండులాలు కలిశాయంటే వాటిని మరలా విడదీయగలం. పాలూ నీరూ కలిసినా యంత్ర సహాయంతో విడగొట్టగలం. కాబట్టి ఇలాంటి కలయిక వల్ల మనకు సుఖంలేదు. వియోగం లేని యోగం కావాలి మనకు.
ప్రస్తుతం బ్రహ్మజ్ఞానికి కలిగే యోగమిలాంటి యోగం. అంతకు ముందు ప్రపంచమనే దొకటి ఉండి దానిని క్రొత్తగా బ్రహ్మాకారంగా దర్శించటం లేదు. జ్ఞాని, అంతకు ముందూ బ్రహ్మ చైతన్యమే ఇది. అయినా అనాది సిద్ధమైన అజ్ఞానంవల్ల ప్రపంచాకారంగా భాసిస్తున్నదా బ్రహ్మం.
Page 23