#


Back

ప్రతి పనికీ వెనకాల పని చేసేది మనసే ఒక దొంగతనం చేయాలని మనసులో అనుకుంటే దొంగతనం చేస్తాము. అలాకాక దేవతార్చన చేయాలనుకుంటే దేవతార్చనే చేస్తాము. ఏది సంకల్పిస్తే అది. సంకల్పాను గుణంగానే సకల కర్మలూ జరుగుతుంటాయి. అలాంటప్పు డాసంకల్పం సవికల్పంగా గాక ఎప్పుడూ నిర్వికల్పంగా ఉండగలిగితే జీవితంలో మనం తప్పకుండా సమత్వాన్నే చూడగలం. అంటే మనసులోనే గాక దైనందిన వ్యవహారంలో కూడా మన మా సమత్వ రూపమైన బ్రహ్మ చైతన్యాన్నే దర్శించగలమని భావం. అయితే ప్రతి దినమూ మన మాచరించే పనులు ఎన్నో ఉంటాయి గదా. అందులో కొన్ని జరిగితే బాగుండుననీ కొన్ని జరగకుంటే బాగుండుననీ కోరుతుంటాము గదా, ఇలాంటి ఇష్టా నిష్టాలు పని చేస్తున్నప్పుడు సమత్వ దృష్టి ఎలా నిలుపుకోగలమని ప్రశ్న వస్తుంది. వాస్తవమే. సవికల్పంగా భావించినంత వరకూ నిలుపుకోవడం కష్టతరమే, కాని నిర్వికల్పమైన భావనను అలవరచు కుంటే మాత్రం నిలవకుండా సోదు. ఆ భావన అలవడాలంటే నీకొకటే మార్గం. మనం చేసే ప్రతి సనీ తప్పక ఫలించాలనే పట్టుదల మనకుండ కూడదు. ఫలించకపోయినా ఒకటేననే బరవసా మనకుండాలి.

మరి ఈ బరవసా ఎలా ఏర్పడాలని ప్రశ్న సంగమనేది లేనప్పుడే అది ఏర్పడుతుంది. అది ఎలా లేకపోతుంది. విశేష దృష్టికి స్వస్తి చెప్పినప్పుడే. దానికెప్పుడు స్వస్తి చెప్పగలం. అంతా నా చైతన్యమే నా స్వరూపమేననే అఖండ భావన సడలకుండా పట్టుకొన్నప్పుడు. అదే గదా యోగమని చెప్పాము. ఆ యోగంలో పాదుకొనిపోవాలి సాధకుడి మనస్సు. యోగస్థః అనే మాటకిదే అర్థం. అలా పాదుకొన్న మనస్సుకు తన స్వరూపం తప్ప మరేదీ కనిపించదు. ప్రతి ఒక్కటీ తన స్వరూపమే. అలాంటప్పుడిక ఏది ఆలోచించినా - తదను గుణంగా ఏ పని చేసినా అందులో భేదం కొనరాదు. స్వరూప భావనతోనే చూస్తాడు. కాబట్టి జయాప జయాదులైన ద్వంద్వాలు రెండూ సమానంగా స్వీకరించే ధైర్య మేర్పడుతుంది. అప్పటినుంచీ సాధకుడి జీవితమిక ఎలాంటి ఒడిదుడుకులూ ఒత్తిడులూ లేకుండా ప్రశాంతంగా నడుస్తూ పోతుంది.

Page 20