#


Back

పదార్ధమేలేదు. ద్వితీయ మనేది లేకుంటే ఇక ఎలాంటి సందేహానికీ ఆస్పదం లేదు. స్థితోస్మి గత సందేహః.

సందేహాలన్నీ నివృత్తి అయినా యంటే ఇక తన ధర్మాన్ని తాను పాటించ వచ్చు మానవుడు. ప్రస్తుత మర్జునుడు పాటించవలసిన స్వధర్మ మేమిటి. కౌరవులతో యుద్ధం. యుద్ధం చేస్తే పదిమందినీ చంపవలసి వస్తుందేమో తన్నిమిత్తంగా పాపం చుట్టుకొంటుందేమో నని గదా సందేహ మర్జునుడికి. అది ఆత్మజ్ఞానంతో తీరిపోయింది. చచ్చేది శరీరమే అది కేవల మసత్కల్పం - పోతే ఆత్మ అనేది అలా చచ్చేది కాదది నిత్య సత్యం-అని గదా గ్రహించాడతడు. ఇక సందేహ మేముంది. స్వధర్మమైన సంగ్రామాన్ని సాగించటాని కాక్షేపణే లేదు. కనుకనే అంటున్నాడు కరిష్యే వచనమ్ తవ అని. హత్వాపి ఇమాన్ లోకా సనే భగవ ద్వచన మతడికి బాగా మనసుకు పట్టి ఉండవచ్చు. అయితే ఇదంతా గురుప్రసాద లబ్దమని మరలా విన్నవించటంలో శిష్యుడి కుండవలసిన వినయ సంపత్తీ-గురు ముఖంగా లభించని విద్య ఫలించదనే సంప్రదాయ రహస్యమూ-కొట్టవచ్చినట్టు ధ్వనిస్తున్నాయి.

116
యత్ర యోగేశ్వరః కృష్ణో-యత్ర పార్థో ధనుర్ధరః
తత్ర శ్రీర్విజయోభూతి-ర్థువానీతి ర్మతిర్మమ    18-78

పరోక్షంగా ఇలాంటి గురుపదేశ ప్రసాదాన్ని తాను సంపాదించి తన ధన్య త్వాన్ని సాధక లోకాని కిలా చాటుతున్నాడు ప్రస్తుతం సంజయుడు.

సమస్త యోగాలకూ మూలకందమైన శ్రీ కృష్ణపరమాత్మ ఎక్కడ ఉంటాడో ఎక్కడ ధనుర్థరుడై పార్థుడు నిలిచి ఉంటాడో అక్కడే శ్రీ విజయమూ భూతీ- నీతీ - అవశ్యముండీ తీరుతాయని నా అభిప్రాయ మంటాడు.

సమ్యగ్జయోస్యా స్తీతి సంజయః - సంజయతీతి సంజయః తాను జయ మును సాధించి దానిని మరలా పరులకు ప్రసాదించేవాడు సంజయుడు. మానవుడు సాధించవలసిన ఆ జయమేమిటి. " ఇహైన తైర్జిత స్సర్గః" అని గీతా వాక్యమే బయట పెట్టిందది ఏమిటో. సృష్టి రహస్యాన్ని ఛేదించటమే జయం. సృష్టి రహస్యంనామ రూపాత్మకంగా విస్తరించి ఉన్న ఈ సమస్తమూ కేవలసచ్చిదాత్మకమైనతత్త్వమేగాని మనేమీ కాదని గ్రహించటమే.

Page 133