అప్పటికి మర్త్యుడయిన ప్రతి ఒక్కడూ అర్జునుడిలా పార్థుడే. వాడు తన మర్త్య త్వాన్ని పోగొట్టుకొని అమర్త్య భావాన్నే Immortality అందుకోవాలంటే ఆత్మ జ్ఞానంతో అజ్ఞానాన్ని నిర్మూలించుకొని ధనంజయుడు కావాలి. ధనమంటే ఇది భౌతికం కాదు. ఆధ్యాత్మికం. మాగృధః కస్యస్విద్దన మన్న దీశావాస్యం అంతా ఈశ్వరుడి ధనమే నట. ఆ ఈశ్వరుడు మనమేనని గ్రహించినప్పుడీ ధనమంతా మనదేగదా. ఆ దృష్టితో జ్ఞాని అయిన ప్రతివాడూ ధనంజయుడే. ఇలాంటి జ్ఞానధనాన్ని జయించినప్పుడే నీవు నిజమైన ధనంజయిడవు. అంతేగాని ఉత్తరకురు భూములను జయించి అసంఖ్యాక ధన రాసులని కొని తేవటం కాదు సుమా- అని అర్జునుణ్ణి వ్యంగ్యంగా కూడా మందలిస్తున్నా డీమాటతో భగవానుడు.
115
నష్టో మోహః స్మృతిర్లబ్ధా - త్వత్ప్రసాదా న్మయా చ్యుత
స్థితోస్మి గత సందేహః - కరిష్యే వచనమ్ తవ 18-73
ప్రస్తుతం జగద్గురు వడిగిన ప్రశ్నకు జగచ్ఛిష్యుడైన అర్జునుడు సమాధాన మిస్తున్నాడు. జగచ్ఛిష్యుడంటే జగత్తుకంతా ప్రతినిధి అయిన శిష్యుడు. మనబోటి మానవుల కంతా ప్రతినిధి అర్జునుడు. "శిష్యస్తేహమ్ శాధిమా” మ్మని శిష్య భావంతోనే ప్రాధేయపడ్డాడు పరమాత్మను. అంతవరకూ భగవానుడాయనకు బోధే చేయలేదసలు. శిష్యుడ్జీ- నన్ను శాసించ మన్నప్పుడే ఉపక్రమించాడు. గీతోపదేశం. శాసితుమ్ యోగ్యః శిష్యః శాసించటానికి యోగ్యు డువడో వాడే శిష్యుడు. ఆ యోగ్యత ఎప్పుడేర్పడుతుంది. ప్రణి పాత పరి ప్రశ్న సేవాదులతో గాని ఏర్పడదది. అవి మూడూ పుష్కలంగా ఉన్నా యర్జునుడికి. మనకుగూడా అలాంటి లక్షనాలుంటేనే గురూపదేశానికి నోచుకొంటాము.
ఉపదేశం బాగా పనిచేసినందు కది మన కివ్వవలసిన ఫలితాలు రెండే. ఒకటి మోహనాశము, మరొకటి స్మృతి లాభమూ, మోహమంటే మనకు భిన్నంగా అనాత్మ ప్రపంచ మేదో ఉందనే భ్రమ. అది పూర్తిగా నశించాలి మనకు. అలా నశించాలంటే దానికి ముందు స్మృతి అనేది లభించాలి. ఏమిటా స్మృతి. ఆత్మ చైతన్యమనే దొక్కటే ఉంది - అది మన స్వరూపమే- మనమేననే స్ఫురణ. ఇందులో అజ్ఞానం నశించటం ప్రతిలోమమైతే ఆత్మజాన ప్రాప్తి అనులోమం. అప్పుడంతా ఆత్మ తత్త్వంగానే భాసిస్తుంది కాబట్టి ద్వితీయమైన
Page 132