#


Back

101
సర్వభూతేషు యైనైకం-భావ మవ్యయ మీక్షతే
వినశ్యత్స్వ వినస్యన్తం-తద్ జ్ఞానం విద్ధిసాత్త్వికం    18-20

అయితే జ్ఞానం జ్ఞానమని ఇంతగా ప్రశంసిస్తున్నారు. ఏమిటా జ్ఞానం ఎలా అభ్యసించాలది అని ప్రశ్న వస్తుంది. ఎన్నోమార్లు విన్నదే అయినా పరమపద సాధన విషయంలో మరలా దాన్ని ప్రపంచించటం ఎంతైనా మంచిది. సాత్త్వికమైన జ్ఞానమే జ్ఞానమన్నారు తత్త్వజ్ఞులు. సాత్త్వికం రాజసంతా మసం అని అసలది మూడు విధాలు. అందులో తామసమనేది నామరూపాలను మనసుకు తెచ్చే ప్రాపంచిక జ్ఞానం ordinary. రాజసం శాస్త్రాలకూ కళలకూ సంబంధించిన వైజ్ఞానిక విషయం scientfic. పోతే రెండింటికీ మూల భూతమైన ఏ అధ్యాత్మిక జ్ఞానమున్నదో అది Spiritual సాత్త్వికం.

ఈ సాత్త్వికమే అసలైన సిసలైన జ్ఞానం వాస్తవానికి. ఎందుకంటే అది అవ్యయం. ఏమాత్రమూ వ్యభిచారం లేనిది. ఎంచేత. దానికి విషయమైన విధ మార్ధం కూడ వ్యభిచారం లేనిదే, వ్యయమన్నా వ్యభిచారమన్నా ఎప్పటికప్పుడు మారిపోవటమని అర్థం. అలాంటి మార్పు మిగతా రెండు జ్ఞానాలలోనూ ఉంటుంది గాని దీనిలో ఉండదు. ఇక్కడ జ్ఞేయమైన పరతత్త్వమెలా మారదో దాన్ని గోచరింపచేసుకొనే జ్ఞానం కూడా అలాగే మారదు. ఎప్పుడూ ఏక రూపంగానే ఉంటుంది.

అది ఎలాగని అడగవచ్చు. పరతత్త్వ మనేది సమస్త భూతాలలోనూ సమా నంగా పరచుకొని ఉన్న ఒకానొక భావం. భూతాలంటే అవి జడ పదార్థాలే కాదు. చేతనాలు కూడా. రెంటికీ భూతమనే శబ్దం వర్తిస్తుంది. అప్పటికి నామరూప క్రియాత్మకమైన సృష్టి అంతా కలిసి వస్తుంది ఈ మాటలో. ఈ సృష్టిలో ఎక్కడికక్కడ విశేషాలూ కనిపిస్తాయి. మనకు వాటన్నిటినీ వ్యాపించిన సామాన్యమూ కనిపిస్తుంది. ఒక సువర్ణంతో చేసిన రకరకాల ఆభరణాలు చూస్తే ఆభరణాలుగా అవి అనేకమైనా వాటిలో ఏకరూపంగా సువర్ణమే కనిపిస్తుంది మనకు. పోతే ఈ సువర్ణం కూడా రజతతామ్ర - కాంస్య-త్రపు సీసాదులైన లోహాలన్నిటి దృష్ట్యా చూస్తే అదీ ఒక లోహవిశేషమే. అప్పుడా విశేషాలన్నిటిలో లోహజాతి అనే సామాన్య మేకరూపంగా సాక్షాత్కరిస్తుంది.

Page 112