#


Back

అంచేత ఈ దేహం రేపు నశించిపోతుంటే దానితోపాటు మన ఆత్మ కూడా నశిస్తుందే అని మనం దిగులు పడనక్కరలేదు. విశ్వతో వ్యాప్తి అయిన ఆ పరమాత్మ చైతన్య మెలాగో అలాగే ఈ జీవ చైతన్యం కూడా అహమనే స్ఫూర్తితో ఎప్పటికీ నిలిచి ఉంటుందనే ధీమాతో ఉండాలి మనం, పోతుందనే బెంగ ఏ మాత్రమూ పెట్టుకోరాదు.

కాకపోయినా అది ఎలా పోగలదు. ఒక నిర్దిష్టమైన రూపముంటే గదా పోవటానికీ రావటానికీ. చైతన్య మొక్కటే దానికున్న రూపం. అది ఒక దాన్ని కనిపెట్టవలసిందే గాని దానినేదీ కనిపెట్టేది లేదు. కనిపెట్టే దెప్పుడూ మార టానికి లేదు. మారితే ఆ మార్పును కనిపెట్టవలసిందదే గదా. కాబట్టి మారదు. మారకుంటే నశించబోదు. దాని పాటి కది సశించక పోయినా మరొక పదార్థమేదైనా నశింపజేయవచ్చు గదా అంటే అది సర్వ వ్యాపకం. సర్వమూ అదే అయి నప్పుడు దానికి విజాతీయమైన భావమేలేదు కదా. ఇక మరొక కాని చేతిలో అది ఎలా నశించటం పోతే ఇత పరిశేష న్యాయంగా దాని చేతిలో అదే సశిస్తుందని చెప్పవలసి వస్తుంది. అది మరీ అర్థరహితమైన ప్రసంగం అగ్ని తన్ను తాను కల్చుకో గలదా. ఆటగాడు తన భుజాల మీదనే తానెరుగలడా. అలాగే ఆత్మ చైతన్యం తన్ను తాను నిర్మూలించుకోట మసంభవం. నిర్మూలన క్రియకు కూడా అదే సాక్షి కావలసినప్పుడది నిర్మూలనమెలా కాగలదు. కాబట్టి ఆత్మ ఎప్పటికీ నశించేది కాదు. కాకుంటే ఇకమనకెలాటి భయాందోళనలూ చెందవని లేదు.

6
వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్లాతి నరోపరాణి
తద్వ చ్ఛరీ రాణి విహాయ జీర్ణా
న్యన్యాని సంయాతి నవాని దేహీ   2-22

నిజమే. చెందబనిలేదు వాస్తవానికి. అయినా మనకలాంటి ధైర్య మబ్బటం లేదు. ఏమి కారణం. దేహంతో పుట్టి దేహంతో పెరిగి దేహంతోనే నశిస్తున్నాము మనం. దేహాతి రిక్తమైన చైతన్యమే నీవని శాస్త్రమెంత ఘోషించి చెప్పినా దానితో తాదాత్మ్యం చెందలేకపోతున్నాము. మీదు మిక్కిలి ఏ శాస్త్రమూ చెప్పకపోయినా నిత్యమూ ఈ చేహమే నేనని దీనితోనే ప్రతి ఒక్కరమూ మమేకంగా బ్రతుకు తున్నాము. అలాంటప్పుడు ధైర్యమనేది ఎలా అబ్బుతుంది. అబ్బకపోవటమే సహజం.

Page 11