#


Back

చూస్తున్నారు తత్త్వాన్ని, తాము చూచిందే అసలు తత్త్వమని నమ్ముతున్నారు. కాబట్టి లోక దృష్టి ననుసరించి తాత్కాలికంగా చేసిన వర్ణన అది. కొంతకాల మలాభాసించినా క్రమంగా వారే ఎప్పటికైనా అసలు తత్త్వాన్ని అందుకోగలిగిన స్థోమత సంపాదిస్తారనీ - సంసాదించినప్పుడు వారికి బోధించవలసిందీ కడపటిదేననీ - శాస్త్రహృదయం.

ఇందులో మొదటిదైన భేదదృష్టే కర్మయోగం. రెండవదైన భేదా భేదదృష్టే భక్తియోగం. పోతే మూడవదైన అభేదదృష్టి జ్ఞానయోగం. ఈ జ్ఞానమే అందుకో వలసింది చివరకు దానిని చేర్చే సాధనాలే మొదట చెప్పిన రెండూ. అవీ సాధకుడికి జ్ఞానం కలిగించటానికి తాత్కాలికంగా కల్పించినవే గాని యధార్థం కావు. యథార్థం అద్వయమైన చైతన్య తత్వమే. అందులో ద్వితీయ మనే మాటకు చోటు లేదు. లేకుంటే ద్వితీయంగా మన మారోపించినంత మాత్రాన అది ఎలా భాసించగలిగిందనీ ప్రశ్న. పశ్యమే యోగ మైశ్వరమ్మనే మాటలో ఉంది సమాధానం నిరుపాధికమైనా నామరూపాదులైన ఉపాధుల ననేకంగా సృష్టించే శక్తి ఉంది దానికి. అదే ఈశ్వరీయమైన యోగమాయ, తనపాటికి తాను కాకపోయినా జీవుల అవిద్యా దోష దృష్టి ననుసరించి అది చిత్ర విచిత్రంగా దర్శనమిస్తుంది. అదే ఈ సృష్టి. విభూతి అనికూడ దీనికే పేరు. అయినా ఇదంతా కల్పితమే కాబట్టి దీనిని ప్రవిలయం చేసుకొని చూచే ఆ చైతన్య తత్త్వమే అసలైన స్వరూపం. అది జ్ఞానం వల్లనే సాధ్యం. కాబట్టి ఆజ్ఞానమే అన్నింటికన్నా ప్రధానమైన సాధానం. అది ఒకటి దగ్గర ఉంటే చాలు. దానిలో మిగతా కర్మోపాసనాది సాధనలన్నీ కలిసి వస్తాయి. ప్రత్యేకంగా వీటికోసం కృషి చేయనక్కరలేదు. చేసినా దానిని సంపాదించటానికే ఆ కృషి. తరువాత వీటి కస్తిత్వంలేదు.

96
రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిద ముత్తమం
ప్రత్యక్షావ గమం ధర్మ్యం సుసుఖం కర్తు మస్యయం    9-2

కనుకనే మరలా మొదటికి వచ్చి మాటాడితే జ్ఞానం కన్నా పవిత్రమైనదీ ఉత్తమమైనదీ మరొక సాధన మేదీ లేదని చెప్పవలసి వస్తున్నది. పవిత్ర మెందుకయింది. సంసార కాలుష్యాన్ని ఏ కొంచెం కూడా మిగలకుండా దహించి వేస్తుంది గనుక. “జ్ఞాన ముత్పద్యతే పుంసాం క్షయాత్పావస్య కర్మణః"

Page 106