#


Back

మోక్షమార్గంలో ఉండే ఈ భూమికలనే చక్కగా బయట పెడుతున్నా యీ రెండు శ్లోకాలూ, సాధన రహస్యమంతా వీటిలోనే గుప్తమయి ఉంది. అధ్యాత్మ రంగంలో సిద్ధమయిన తత్త్వాన్ని బట్టే ఎప్పుడూ సాధన అనేది నిర్ణీతమై ఉంటుంది. ఎందుకంటే సాధన వల్ల చేరవలసింది చివరకా తత్త్వాన్నే. అలాంటప్పుడు సాధన దానికి విలోమంగా ఉండటం ఎలా చెల్లుతుంది.

అయితే ఈ తత్త్వ మనేది తన పాటికి తాను ఒకే రూపంలో ఉన్నా - దాని నర్థం చేసుకొనే సాధకుల దృష్టిని బట్టి అనేక రూపాలుగా భాసిస్తూంటుంది. అప్పటికి వారికదే గమ్యమవుతుంది. కాని అది వస్తు త్తత్వం కాదు. సాధకుడి దృష్టి అంతకంతకు పెరిగే కొద్దీ అదీ పెరుగుతూపోతుంది. అలా పెరుగుతూ పూర్తిగా వస్తువును సమీపించి దృష్టి నిలిచే సరి కది అప్పుడు వాస్తవమైన స్వరూపంగానే అనుభవానికి వస్తుంది.

దీనిని బట్టి చూస్తే ప్రస్తుతం అవ్యక్తరూపుడనైన నేనీ సృష్టినంత వ్యాపించి ఉన్నా నంటున్నాడు పరమాత్మ. ఇది భేద దృష్టి ననుసరించి చెప్పినమాట. ఇందులో సృష్టివేరు. స్రష్టవేరు. రెండూ సత్యమే. సృష్టిలో ఒకడుగా జీవిస్తున్న మన మీ సృష్టికంతా నాయకుడైన పరమాత్మ ఒకడున్నాడని గుర్తించి తత్సేవకుల మని భావిస్తూ తద్భంగా సత్కర్మ లాచరిస్తూ సత్త్వాన్ని శుద్ధి చేసుకొనే ప్రయత్నం చేయాలి.

అలా చేశామంటే సకల భూతాలూ నాలో ఉన్నాయేగాని నేను మాత్రం వాటిలో లేనని చాటుతున్నాడు పరమాత్మ. ఇది భేదా భేద దృష్టి ననుసరించి చెప్పిన వాక్యం. పరమాత్మకు సంబంధించినట్టుగా ఈ సృష్టిని చూడటమంటే గుణ విశిష్టంగా తత్త్వాన్ని భావించటమని అర్థం చేసుకోవాలి. దీనిమూలంగా సృష్టిని వేరుగా చూడక తద్విశిష్టమైన పరమాత్మ తత్త్వాన్నే పట్టుకొంటాడు. కాబట్టి సాధకుడి చిత్తానికి శుద్ధియేగాక ఏకాగ్రత కూడా ఏర్పడుతుంది. అలా ఏర్పడ్డ తరువాత మూడవ భూమిక ఒకటుంది. ఆఖరిది కూడ అదే.

“నచ మతాని భూతాని" నాలో కూడ అసలవి లేవు. వాస్తవంలో ఉన్నది నేనొక్కడనే. దీనిని బట్టి పరమాత్మతత్త్వ మొకటి తప్ప సృష్టి అనేదసలు దానికి భిన్నంగా ఎప్పుడూ ఎక్కడా లేదని అర్థమవుతున్నది. ఇది కేవల మభేదదృష్టి ననుసరించి చెప్పేమాట. ఇదే అసలు పరమార్ధం. అయితే ఆ ముందు చెప్పిన రెండు మాటల కర్థమేమిటి. అవి లేవు వాస్తవంలో. అయినా లోకు లావిధంగా

Page 105