దానికి కారణం సన్న్యాసం. అంటే సర్వధర్మ పరిత్యాగం. లేదా ప్రవిలాపనం. మొత్తం గీతాశాస్త్రమంతా కలిసి వచ్చింది. విషాదయోగంతో ప్రారంభమయింది గీత. మోక్ష సన్న్యాసంతో సమాప్త మయింది. ఆరంభంలో అశోచ్యా నన్వశోచః అని శోకమనే మాట వినిపించింది. మాశుచః అని ఇక్కడ అంతంలో శోక పరిహారం వినిపిస్తున్నది మనకు. శాస్త్రానికే గాక శాస్త్రమనే వ్యపదేశంతో మానవ జీవితానికే గొప్ప పరిష్కారమిది. విషాదంతోనే గదా మన జీవితారంభం. విషాదమే గదా జీవిత మధ్యం. కాని అది విషాదంతోనే మరలా అంతమయి పోకుండా శాస్త్రం మనకు సలహా ఇస్తున్నది. నామరూపాది ధర్మాలన్నీ నెత్తిన పెట్టుకోటం వల్లనే ఈ విషాదం. అదే నీకు సమస్య. అవి నీ స్వరూపాని కన్యమని గాక అనన్యమని భావించు. నీలోనే అవి ప్రవిలయమై మరలా నీకు నీవే శేషించగలవు. అదే నీ విషాద జీవితానికి పరిష్కారం. అదే అమృతత్వమని శాస్త్రమూ సద్గురువూ మనకిచ్చే గొప్ప హామీ.
ఇక్కడికి గీతా శాస్త్రోపదేశం సమాప్తమయింది. ఉపక్రమోప సంహారాల కేక వాక్యత Consistency ప్రదర్శించాడు మహర్షి. పోతే ఇక శాస్త్ర సంప్రదాయమని ఒకటున్నది. సంప్రదాయమంటే ఒకరి కంద చేయటం. ఈ జ్ఞానమందు కొన్న జ్ఞాని అది తన వరకే ఉంచుకోక దాన్ని లోకంలో నలుగురికీ అందజేయాలి గదా. అది ఎలా అందజేయాలని ప్రశ్న వచ్చింది. ఎవరికంటే వారికీ విద్య బోధించకండి. దానినందుకొనే
Page 524