విభూతి యోగము
భగవద్గీత
పావనం చేసే వాటన్నిటిలో లేదా వీచే వాటిలోనైనా కావచ్చు. పవనుణ్ణి వాయువును. శస్త్రధారులైన వీరులందరిలో దశరధ కుమారుడైన శ్రీరాముణ్ణి. మత్స్యాది జల జంతువులన్నిటిలో మకరం అంటే మొసలిని నేను. స్తోతస్సులంటే స్రవించే స్వభావమున్నవి. నదీ నదాలు. వాటన్నిటిలో నేను గంగా నదిని. ఇంతకు ముందు వచ్చింది సరస్సు. ఇది స్తోతస్సు. రెంటికీ తేడా ఉంది.
సర్గాణా మాది రంతశ్చ మధ్యం చైవాహ మర్జున
ఆధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతా మహమ్ - 32
సర్గమంటే సృష్టి. సృష్టులెన్నో జరిగిపోయాయి. జరుగుతున్నాయి. జరగబోతాయి. అన్నింటికీ నేను ఆది మధ్యాంతాలను. అంటే సృష్టి స్థితి లయ స్వరూపుణ్ణి నేనే. ఇంతకు ముందు వచ్చిందీ ఆది మధ్యాంతాలనే మాట మొదట్లో. అక్కడ జీవకోటికి మాత్రమే ఆది మధ్యాంతాలు. ఇక్కడ అలా కాదు. మొత్తం జడ ప్రపంచ సృష్టి కంతటికీనని అర్థం చేసుకోవాలి. అధ్యాత్మ విద్యా. విద్య లెన్ని ఉన్నాయో లోకంలో అన్నిటికీ అధ్యాత్మ విద్యను నేను. కారణం మిగతా తొంభయి తొమ్మిది బంధ కారణమైతే అది ఒక్కటే మోక్షదాయకం. అంతేగాక సమస్తమైన విద్యలకూ పర్యవసానం Conclusion కూడా అదే. పోతే అర్థ నిర్ణయహేతు వైనదేదో అది వాదం Discussion. అలాటి వాడాలలో పరమార్ధ నిర్ణాయకమైన వాదమేదో అది. నేను.
Page 334