#


Index

విభూతి యోగము

మనువులు. చతుర్దశ మనువులలాగా వీరూ ప్రసిద్ధులే. వీరు నలుగురే. కాబట్టి గీతాచార్యుడీ నలుగురి నుద్దేశించే చెప్పాడను కోవాలి మనం. పోతే ఆ ఏడుగురు మహర్షులూ ఈ నలుగురు మనువులూ వీరందరూ పరమాత్మ మానససృష్టి అయితే యేషాం లోకే ఇమాః ప్రజాః అని చాటుతున్నది గీత. వీరి మూలంగా జరిగిందట మరలా ఈ భూత భౌతిక సృష్టి అంతా ఈ లోకంలో. అప్పటికి సాక్షాత్తుగా పరమాత్మ వల్ల వారు జన్మిస్తే వారి వల్ల పరం పరయా ఈ చరాచర పదార్థాలు జన్మించాయని చెప్పినట్టయింది.

  ఇక్కడ మన మొక గొప్ప పౌరాణిక హృదయాన్ని భేదించి పట్టుకోవలసి ఉంది. అదేమిటంటే మహర్షులనూ మనువులనే పేర్కొంటా యెప్పుడూ పురాణాలు గానీ భగవద్గీత లాంటి స్మృతులుగానీ. వారిద్దరినే ఎందుకిలా ప్రత్యేకించి చెప్పటం. మహర్షు లనండి ప్రజాపతు లనండి. వారందరూ బ్రాహ్మణులు. మరి మనువులందరూ క్షత్రియులు. బ్రహ్మ క్షత్త్రియ జాతులకు సంకేతాలే వారిద్దరూ. అవి మరలా ఏవో గావు. జ్ఞాన క్రియా శక్తులకు ప్రతీకలు. జ్ఞానమూ ప్రాణమూ ఇవి రెండూ సహకరించినప్పుడే సృష్టి జరుగుతుంది. పరమాత్మ జ్ఞానశక్తి అయితే ఆయన ప్రకృతి క్రియాశక్తి. ఆయన జ్ఞాన మావిడ ప్రాణం. సంకల్పించటానికి జ్ఞానం. అమలు పరచటానికి ప్రాణం. రెండూ అవసరం. కనుక ప్రకృతి పురుష తత్త్వాలు రెండూ చేరి సృష్టి వ్యాపారానికి మూలభూత మయ్యాయి. ఆది సృష్టి కేది సూత్రమో అనంతర సృష్టికి కూడా అదే సూత్రం. జ్ఞానమూ

Page 292

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు