
అయితే మరి బ్రహ్మజ్ఞానమూ తన్నిమిత్తంగా మోక్షమనే ఫలమూ ఎలా సిద్ధిస్తుందని అడగవచ్చు. దానికీ దేవతో పాసనా రూపమైన యోగం కాదు సాధనం. మరేమిటి. మద్దతేనాంత రాత్మనా. శ్రద్ధావాన్ భజతే యోమాం. దేవతలకు కూడా దేవత పరాదేవత అయిన నన్నేసేవించా లంటాడు భగవానుడు. ఎవడా భగవానుడూ ఎవడా పరా దేవత అంటే మయివాసుదేవే అని ఒక్క మాటలో బయటపెట్టారు ఆచార్యులవారు. వాసుదేవుడే ఆ దేవత. దేవతగాని దేవతా. వసుదేవుని కుమారుడని గాదు వాసుదేవుడంటే. వసతి దీవ్యతీతి అని అర్ధం చెప్పాలా శబ్దానికి. అంటే అస్తిభాతి. సచ్చిత్తులని భావం. అదే సర్వ జగద్వ్యాప్తమైన ఆత్మ చైతన్యం.
అది ఎక్కడో లేదు. సాధకుడి ఆత్మ స్వరూపమే. ఎటు వచ్చీ సమాహితమైన అంతః కరణంలో ఆ తత్త్వాన్ని శ్రద్ధా సక్తులతో ధ్యానిస్తూ ఉండాలి. దీనికే నిదిధ్యాసనమని పేరు. విజాతీయమైన అనాత్మ భావగంధం కూడా లేని సజాతీయమైన ఆత్మ స్వరూపాన్నే ధారావాహికంగా భజిస్తూ పోవటమే నిదిధ్యాస. అలాటి భావనతో ఎవడు నన్ను తన స్వరూపంగా నిత్యమూ గుర్తు చేసుకొంటూ పోతాడో వాడే అసలైన యోగి. సమే యుక్తతమో మతః - యోగులలో కూడా మిగతా వారికన్నా ఉత్తమోత్తముడైన మహాయోగి. కనుక ఏతా వతా భగవత్సందేశ సారాంశమేమంటే ఆనాటి
Page 547
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు