ఆత్మసంయమ యోగము
భగవద్గీత
తాబేలులాగా పట్టు వదలకుండా ప్రయాణం చేస్తూ పోతే దానికంటే ముందుగానే గమ్యం చేరవచ్చు. అలాటివాడే యోగి. అందుకే తపస్వి కన్నా జ్ఞాని కన్నా కర్మి కన్నా ఉత్తముడు యోగి అని చాటటం. తస్మాద్యోగీ భవార్జున. కాబట్టి నీవు కూడా యోగాభ్యాస పరుడవయి జీవించమని సలహా ఇస్తాడు పరమాత్మ.
యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా |
శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్తతమో మతః || 47 ||
అంతకన్నా ఇంకా గొప్ప సందేశ మిస్తున్నాడిప్పు డర్జునుడితో సహా మనందరికీ. ఏమిటది. యోగినా మపి సర్వేషాం. యోగులలో కూడా చాలా తరగతు లున్నాయి. ఒకడు రుద్రుడే దేవత అని ఆరాధిస్తూ కూచుంటాడు. ఇంకొక డాదిత్యుణ్ణి ఉపాసిస్తాడు. ఇంకా ఒకడా దేవతనో ఈ దేవతనో పట్టుకొని కూచుంటాడు. దేవతో పాసనే గాని అది బ్రహ్మోపాసన గాదు. బ్రహ్మం తాలూకు శక్తి శకలాలే ఈ దేవతలనే వారు. బ్రహ్మం సమష్టి రూపమైతే వీరందరూ వ్యష్టి రూపులీ దేవతలు. అసలైన బ్రహ్మ స్వరూపాన్ని పట్టుకోక ఈ చిల్లర దేవతలను పట్టుకొని కూచుంటే ఏమి ఫలం. ఫలమనేది ఉన్నా అది ఏ కొంచెమో. పరిమితమే గాని అది పరిపూర్ణం కాదు. పరిపూర్ణం కాకుంటే అది జ్ఞానమెలా అవుతుంది. మోక్షమెలా సిద్ధిస్తుంది.
Page 546