#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

జ్ఞానాని కేమి పనికి వస్తుంది. పోతే జ్ఞాని భ్యోపి మతో ధికః - తపస్వులే గాదు. జ్ఞానులకన్నా గొప్పవాడు. జ్ఞానమంటే ఇక్కడ ఆత్మజ్ఞానం కాదు. శాస్త్రార్ధ పాండిత్యమని అర్థం వ్రాశారు భాష్యకారులు. కేవలం Bookish పుస్తక జ్ఞానం. అది పరోక్షమే. అపరోక్షం కాదు. అపరోక్షం కాకుంటే దర్శనం కాదు. అనుభవ మంతకన్నా కాదు.

  అంతేకాదు. కర్మి భ్యశ్చాధికో యోగీ. యోగి కర్మిష్ఠుల కంటే గొప్ప వ్యక్తి. కర్మలు చేసేవాడు కర్మి. కర్మయోగం కాదిది కర్మానుష్ఠానం. అగ్నిహోత్రాదులైన నిత్యనైమిత్తికాలు యాంత్రికంగా చేస్తూ పోయే వాడు కర్మి. వాడే కర్మిష్ఠుడు. జ్ఞానం లేదు వాడికి. జ్ఞానం కోసం ప్రయత్నమంత కన్నా లేదు. ఇక ఎందుకు పనికి వస్తాడు. అగమ్యం వాడి జీవితం. నిరర్ధకం.

  మరి యోగి జీవితమో. వీడు యాంత్రికంగా కర్మ చేయడు. శరీరాదులను శుష్కింప చేసుకొనే హఠయోగ మంతకన్నా చేయడు. తుదకు పుస్తకాలు చదివి ఎంతో జ్ఞానం సంపాదించాను. నాకంటే గొప్పవా డెవడున్నాడని విర్రవీగడు. నిరంతరమూ ఆత్మ దర్శనం కోసం నిరహంకారంగా నిష్కామంగా కర్మయోగం పాటిస్తూ దానితోపాటు ఏకాగ్రతతో ధ్యానయోగ మభ్యసిస్తూ తన జీవితకాలం సద్వినియోగం చేసుకొంటుంటాడు. ప్రయత్నం సక్రమంగా చేస్తూపోతే ఫలిత ముండకుండా పోదు. కుందేలు లాగా ఎగిసిపడ్డా గమ్యం చేరలేడు. దానికి బదులు

Page 545

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు