ఆత్మసంయమ యోగము
భగవద్గీత
జన్మసు కించి త్కించి త్సంస్కార జాత ముపచిత్య - తేన ఉప చితేన అనేక జన్మ కృతేన సంసిద్ధః లబ్ధ సమ్యగ్దర్శనః అనేక జన్మ లెందుకు కావలసి వచ్చిందంటే ఒక్కొక్క జన్మలో కొంచెం కొంచెం సంస్కారం పోగు చేసుకొని తద్ద్వారా కడసారిగా వచ్చే జన్మలో సమ్యగ్దర్శనం సంపాదించే అవకాశ ముంటుంది సాధకుడికి. ఇదీ ఆయన మాట.
ఏ విద్యలోనైనా అభ్యాసమనేది ఉండి తీరుతుంది. ఒక సంగీతమే గాదు. సాహిత్యమే గాదు. నాట్యమే గాదు. శరీర వ్యాయామమే గాదు. కందుకాది క్రీడలే గాదు. మాటి మాటికీ అదేపనిగా కృషి చేస్తూ పోతే గాని ఫలితమీయదు. ఇదుగో ఆ చేయటానికి పట్టే కాలమే జన్మాంతరాలు. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క అభ్యాస మనుకోండి Exercise. అలా అభ్యసిస్తూ పోతే తతో యాతి పరాంగతిం. చివరకు పరమ పదమైన మోక్షమే లభిస్తుంది సాధకుడికి. సందేహం లేదు.
తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః |
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున || 46 ||
ఇంతకూ నేను చెబుతున్నాను విను. యోగి అంటే ఎవరనుకొంటున్నావో. సామాన్యుడు కాడు. ఆత్మ దర్శనానికి నిరంతరమూ కృషి చేసే వాడే యోగి. వాడు తపస్వుల కన్నా గొప్పవాడు. శరీరేంద్రియ శోషణమేగా తపస్సంటే. అంతకన్నా ఏముంది. అలాంటి హఠయోగం
Page 544