#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః |
అనేకజన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్ || 45 ||

  కాబట్టి ప్రారబ్ధ మది ఒక పెద్ద దయ్యం - దాన్ని ఎలాగా తప్పించుకోటమని గాబరా పడగూడదే మానవుడూ. ముఖ్యంగా యోగ సాధకుడు. ప్రతిలోమంగా Negative గాక అనులోమంగా Positive ఆలోచించా లెప్పుడూ. అదే జయం జీవితానికి. కృషితో నాస్తి దుర్భిక్షమని ఇంతకు ముందుగానే గదా హెచ్చరించాము. కనుక ప్రయత్నా ద్యత మానస్తు. అంతకంత కధికంగా ప్రయత్నం సాగిస్తూ పోవాలి సాధకుడు. అలా సాగించే కొద్దీ యోగి మనస్సుకు పట్టిన కిల్బిషం - మాలిన్యమంతా క్షాళితమయి సంశుద్ధ కిల్బిషుడవుతాడు.

  అది కూడా ఒక్క జన్మలో జరిగే వ్యవహారం కాదు. ఇహైక భవికా ముక్తిః అని కొందరు పెద్దలు చెప్పారను కోండి. అది తీవ్రవేగులైన ఉత్తమాధికారుల విషయం. అందరూ అలాటి ఉత్తములు కారు. మధ్యము లుంటారు. మందాధి కారు లుంటారు. వారు మాత్ర మొక జన్మతోనే తరిస్తారని చెప్పలేము. అలా చెబితే అత్యాశ అవుతుంది. అయితే మరేమంటారు. అనేక జన్మ సంసిద్ధః - కొన్నిజన్మలు పడుతుంది యోగాభ్యాసం ఫలించటానికి స్వామివారు వ్రాస్తున్నారు వినండి. అనేకేషు

Page 543

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు