
ఉపోద్ఘాతము
అధ్యాత్మ రంగంలో భగవద్గీతకు వచ్చిన ప్రచారం మరి దేనికీ రాలేదు. మహాభారతంలో ఒక్క భగవద్గీతే గాదు. ఎన్నో ఉన్నాయి గీతలు. ఋభుగీత - హంసగీత బ్రాహ్మణ గీత అను గీత - ఒక్కటిగాదు. చాలా ఉన్నాయి. కాని వాటిలో దేనికీ రాలేదింత ప్రఖ్యాతి. ఇంతకన్నా నాలుగురెట్లు పెద్దది మోక్షధర్మమనే ప్రకరణం. అదీ వేదవ్యాసుడి రచనే. దానికి గూడా ఇంత పేరు లేదు. ఆఖరుకు మృత్యురహస్యాన్ని కూడా భేదించి బయటపెట్టిన సనత్సు జాతీయానికి కూడా లేదు. క్రైస్తవులకు హోలీ బైబులెలాటిదో - మహమ్మదీయులకు ఖరానే షరీ ఫెలాంటిదో భారతీయులకు భగవద్గీత అలాంటిది. వాటికి లోకంలో ఎంత ప్రఖ్యాతీ వ్యాప్తి ఉన్నదో భగవద్గీతకు కూడా అంతే ఉన్నది.
ఇంకా ఒక విశేషమేమంటే భగవద్గీత నిజంగా భగవద్గీతే. అంటే అర్ధం. ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. భగవంతుడంటే జ్ఞాన స్వరూపుడు. అఖండమైన జ్ఞానమది. అది కూడా సిద్ధమే Ready made గాని సాధ్యం To be made కాదన్నారు. కనుక అల్పజ్ఞుడైన మానవుడు దాన్ని అందుకొని తరించాలంటే జ్ఞానమొక్కటే మార్గం మరేదీ గాదు. అది కూడా సిద్ధమే కాబట్టి క్రియారూపమైన సాధన ఏదీ లేదు. ఉన్నదల్లా దాని నున్నదున్నట్టు గుర్తించటమే.
Page 5
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు