#


Back

Page 1

అద్వైత ప్రశ్నావళి

గురువు గారు సత్సంగములలో శిష్యులను అడిగిన ప్రశ్నలు.

1a. ఆత్మ, అనాత్మ అంటే ఏమిటి?

1b. ఆత్మ, అనాత్మ అనే రెండు పదార్ధాలున్నప్పుడు అది అద్వైతమెలా అవుతుంది ?

02. అనాత్మ, ఆత్మగా మారాలి కాని ఆత్మ అనాత్మగా మారితే అది అద్వైతం కాదు. ఎందుకని?

03. అంతా ఆత్మేనని ఎలా నిరూపించగలవు?

04. ఉపాధి లేకుండా ఆత్మ ఉండగలదా? ఉపాధి వుండాలని ఒప్పుకుంటే ఆ ఉపాధి ఎలాటిది?

05. వస్తువు, ఉపాధి రెండూ ఉన్నా అది అద్వైతమేనని ఎలా సమర్ధించగలవు?

06. చైతన్యం నుంచి అచేతన ప్రపంచం ఎలా వచ్చింది? అది అచేతన శరీరంలో బందీ ఎలా అయింది?

07. జ్ఞేయం జ్ఞానం మీద ఆధారపడ్డట్టే జ్ఞానం కూడ జ్ఞేయం మీద ఆధారపడాలి కదా?

08. జ్ఞానం నిత్య సిద్ధమైనప్పుడు దానికి ఉదయాస్తమయములు ఎలా ఏర్పడుతున్నాయి?

09. ఆత్మ ఎప్పుడు వర్తమానం. భూత భవిష్యత్తులే జనన మరణాలు. అవి ఆత్మకు లేవా?

10. సామాన్య విశేషాలంటే ఏమిటి, వాటి లక్షణాలేమిటి? ఇప్పుడు మనకున్నది మనము చూచేది సామాన్యమా? విశేషమా?

11. జీవుడంటే ఎవరు? జగత్తంటే ఏమిటి? అవి రెండూ సామాన్యమా? విశేషమా?

12. విశేషాల సంబంధమే మన అనుభవంలోనున్నప్పుడు ఇక సామాన్యమెక్కడుంది? అది మన అనుభవానికి ఎలా రావాలి?

13. కాలమంటే ఏమిటి? ఆత్మకాలాతీతమెలా అయింది?

14. మనస్సుకు ఆత్మకు సంబంధమేమిటి ? మానవుడు వాడి మనస్సా? ఆత్మా?

15. ఆత్మ అయితే కేవలం నిరాకారం. వ్యాపకం, నిశ్వలం కదా. దానికి మనస్సుతో తద్వార ప్రపంచంతో వ్యవహారమెలా ఏర్పడింది?

16. వ్యవహారానికి దూరమైతే పరమాత్మ పరిచ్ఛిన్నం కదా? అది పరిపూర్ణమెలా కాగలదు?

17. జ్ఞానమే కర్మ అని ఎలా నిరూపించగలవు?

18. ఇంత స్పష్టంగా కనిపించే ప్రపంచము అసత్యమెలా అయ్ంది? అసలే కనిపించని ఆత్మ సత్యమెలా అయింది?

19. సమస్యకు పరిష్కారం సాధనే కదా? ఆత్మ మనకు సిద్ధమేనన్నారు అలాటప్పుడు దానిని సాధించటమేమిటి?

20. స్వరూపమే అయినప్పుడు అది మనకు దూరమెలా అయింది? కాదంటారా? సాధించే ప్రయత్నమెందుకు శాస్త్రం చెప్పింది?

21.’ప్రత్యభిజ్ఞ’ అంటే ఏమిటి? ’ప్రవిలాపన’ మంటే ఏమిటి? అన్యయించి చూపండి?

22. ఆత్మను గుర్తించినా కూడ అనాత్మ ఎందుకు లయం కావడం లేదు? లయం కాకుంటే మోక్షమెలా అయింది?

23. జ్ఞానముదయిస్తే చాలదా? మరల జ్ఞాన నిష్ఠ ఎందుకు చెప్పారు?

24. ప్రపంచము ఆభాస అన్నారు కదా! మరల జ్ఞానికి ప్రారబ్ధమేమిటి? అది ఉంటే మోక్షానికర్ధమేమిటి?

25. మానవుడికి లోక జ్ఞానముంటే చాలదా? శాస్త్ర జ్ఞానం దేనికి?

26. శాస్త్రాలన్నింటిలో వేదాంత శాస్త్రము ఎలా గొప్పదయింది?

27. అద్వైత వేదాంతంలో పదార్ధాలు ఎన్ని అవి ఏవి?

28. ఆత్మ ఏమిటి? అనాత్మ ఏమిటి?

29. జీవజగదీశ్వరులు అనేవారు ఎవరు? ఆత్మా? అనాత్మా?

30. ఆత్మ, అనాత్మలు రెండూ వాస్తవమా? ఒకటేనా? ఒకటే అయితే అది ఏది?

31. కనిపించని ఆత్మ ఎలా వాస్తవమైంది? కనిపిస్తున్న జగత్తు ఎలా అవాస్తమైంది?

32. జగత్తుగా కనిపించేది కూడ ఆత్మేనని ఎలా చెప్పగలవు?

33. నేను అనే భావం నా శరీరంలోనే కదా కలుగుతున్నది. అలాటప్పుడు శరీరానికి బాహ్యంగా ఉన్న ప్రపంచం నాదే కాని నేను ఎలా కాగలను? కాకుంటే అది కూడ ఆత్మేనని ఎలా భావించాలి?

34. సర్వ వ్యాపకమైన ఆత్మ శరీరంలోనే ఎలా బందీ అయింది? అయితే దానికేమని పేరు?

35. దాని కన్యంగా శరీరం చుట్టూ కనిపించేదాన్ని ఏమంటారు?

36. ఇందులో వస్తువేది ? ఆభాస ఏది? రెంటికీ ఏమి సంబంధం?

37. అనాత్మ ప్రపంచాన్ని ఆభాసగా కాక వాస్తవమని చూస్తే ఏమిటి ప్రమాదం?

38. ఆభాస అని చూస్తే ఏమి లాభం?

39. అలా చూస్తూపోతే ఆభాస ఏమౌతుంది ?

40. ఆభాస అని చూడాలంటే ఏమిటి షరతు? అది ఎలా సాధ్యము? దాని విధానమేమిటి?

41. ఆభాఅను వస్తువుగా చూడటమంటే అది క్రొత్తగా చూడటమా? అంతకుముందు ఉన్నదే ప్రకటం కావటమా?

42. ప్రకటం చేసుకొనేది జ్ఞానమే అయినపుదు అది మన దగ్గరే ఉన్నది కదా ఇక ప్రయత్నం దేనికి?

43. ఇది కాదు వేరే జ్ఞానమంటారా? నిరాకారమైన జ్ఞానాలు రెండుంటాయా? ఉంటే రెండింటిలో తేడా ఏమిటి?

44. విశేషంగా కాక దానికధిష్ఠానంగా సామాన్య మొకటి ఉన్నట్లు ఏమిటి దాఖలా?

45. సామాన్యమొకటి ఉంటే దాన్ని ఎలా గుర్తించటం? ఏమిటి సాధనం ?