#


Index

భాగవత ప్రాశస్త్యము

పేర్కొన్నాడు. ఈ వృత్తవధ గాయత్రీ మంత్రార్ధాలకూ భాగవతం ప్రతిపాదించే సత్య ధర్మాలకూ ఏమిటి సంబంధం. అదే గొప్ప రహస్యం. సత్య ధర్మాలకు ప్రతీకలే అవి. ఇందులో సత్యానికి ప్రతీక వృత్త వధ అయితే ధర్మానికి ప్రతీక గాయత్రి. అది ఎలాగో చూతాము.

  “ధామ్నా స్వేన సదా నిరస్త కుహక” మని ఉన్నది సత్య ప్రతిపాదకమైన మొదటి శ్లోకంలో. నిరస్త కుహక మయిందట సత్యం. కుహకమంటే అజ్ఞాన తిమిరమని చెప్పాము. తిమిరం లాగానే అది ఆవరణ రూపమయినది. వృత్రమంటే ఆవరణమనే అర్థం. వృత్రాసురుడప్పటి కెవరో గాదు. నిత్యమూ చైతన్య తత్త్వాన్ని ఆవరించిన మహామాయ. అది పరమేశ్వరుడికి వశవర్తిని అయినా మనపాలిటికి గళ గ్రాహిణి. అసుషు రమత ఇత్యసురః నిత్యమూ తన ప్రభావం చేత మానవుణ్ణి విషయసుఖ లంపటుణ్ణి చేసి దానిలోనే ముంచి వేస్తుంది. దానికి కారణం దాని త్రిగుణాలే. సత్వరజస్తమస్సులనే ఆ త్రిగుణాలే త్రిశీర్షాలు. త్రిశీర్షుడంటే త్వష్టృ ప్రజాపతి. త్వష్టృ అంటే తొలిచే స్వభావమున్నవాడని అర్థం. అలాంటి స్వభావమున్నది మాయాశక్తి. దానికున్న త్రిగుణాలే ఈ త్రిశీర్షాలు. అందులో ఒకటి అన్నాదమట. ఇది తమోగుణం. మరొకటి సురాదం. ఇది రజోగుణం. ఇంకొకటి సోమాదం. ఇది సత్త్వగుణం. ఈ మూడింటి వల్లా మనకు ఆవరణమనేది ఏర్పడి స్వరూప జ్ఞానం లేకుండా పోయింది. అదే వృత్ర విజృంభణం. దానిని మనమింద్రులమై జయించాలి. ఇదమ్ఐ అనేదే ఇంద్ర అయిందని శాస్త్రం. ఇదం అంటే మాయా జన్యమైన జగత్తు. దీనిని ద్ర చూస్తున్నాము మనం. ఇది గాదు చూడవలసింది. దీని కతీతమైన మన అసలు తత్త్వాన్ని చూడాలంటే దానికీ వృత్త వధ ముఖ్యం అంతకు ముందు దానికి నిమిత్తమైన త్రిగుణాలు నశించాలి, కనుకనే మొదట త్రిశీర్షచ్ఛేదమూ తరువాత వృత్త సంహారమూ జరిగినట్టు చూపుతుంది పురాణగాధ. దానితో కుహక నిరాసం సమాప్తమవుతుంది. ఇదంతా కుహక నిరాసమనే మాట కల్లుకొంటూ పోయిన ఆఖ్యాయిక.

  పోతే ఇక రెండవ శ్లోకంలో “ధర్మః ప్రోజ్ఞిత కైతవః” అనే మాట. ఈ భాగవత ధర్మానికి ప్రతీకే గాయత్రీ మంత్రం.

Page 48

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు