#


Index

కర్మయోగులు - దక్షాదులు

గాని వధించటం ధర్మం కాదు. అది భగవదుద్దేశమూ కాదు. కనుకనే నిల్వ నిలుచున్ అని వర్ణించటం. నిలిచినప్పుడు దొరికాడని చెప్పి కాల్చివేయవచ్చుగదా. కాని కాల్చలేదంటే ఏమిటర్ధం. ఏడిపించటమే గాని అంతకు మించి అపకారం చేయటం కాదని అర్థమవుతున్నది.

  సరే. దాని ఢాకకు తట్టుకోలేక ఆ ఋషీశ్వరుడెన్నెన్నో లోకాలు తిరుగుతాడు. ఎందరెందరినో శరణు వేడుతాడు. ఎవరూ కాపాడలేకపోయారు. కడకు బ్రహ్మా ఈశ్వరుడే కాదు. విష్ణువు కూడా నేను నీకభయ మివ్వలేనంటాడు అయితే ఒక ఉపాయం చెబుతాడు.

సాధవో హృదయం మహ్యం - సాధూనాం హృదయం హ్యహమ్ మదన్యం తేన జానంతి - నాహ తేభ్యో మనాగపి అతో హ్యాత్మాభిచారస్తే - యతస్తం యాతు వైభవాన్

  భక్తులు నా హృదయంలాంటివారు. వారికీ నేను హృదయ భూతుణ్ణి. వారిని కాదని పోయే శక్తి నాకు లేదు. కాబట్టి నీకీ ఉపద్రవం ఎవరివల్ల వచ్చిందో వారినే పోయి ఆశ్రయించమని సలహా ఇస్తాడు. చేసేది లేక చస్తూ పడుతూ వచ్చి దుర్వాసుడు మరలా ఆ రాజోత్తముడి కాళ్లమీద పడి పాహిమా మని మొరబెడతాడు. అంతవాడి శిరస్సు తన పాదాలమీద వాలటం కూడా సహించ లేకపోయాడా మహాభాగవతుడు. మరొకడైతే తనకలాటి అపకారం చేసినందుకెంతగానైనా ప్రతీకారం చేయాలని చూచేవాడు. శమదమాది సంపన్నుడైన భాగవతుడంబరీషుడు. అలా చేయకపోగా మహర్షి శిరస్స్పర్శకు కూడా సిగ్గు పడతాడు. వెంటనే తన పాదాలు వెనక్కు తీసుకొంటాడు. ఋషి తన్ను రక్షించమని మొరపెడితే తగుదునమ్మా అని ఒక దేవతలాగా చేయెత్తి ఆయన కభయమిచ్చిన వాడూ కాదు. అది కూడా లేని పెద్దఱికాన్ని పైన వేసుకోటమనే ఆ భక్తుడి తలంపు. అంచేత ఆ సుదర్శన చక్రాన్నే ఉపశమించమని చెప్పి పరిపరివిధాల స్తోత్రం చేస్తాడు.

  చూడండి. అది కేవలమొక ఆయుధం. దేవుడు కాదు. దేవుడి చేతిలోనిది. దేవుడే తన చేతిలోని వాడంబరీషుడికి. ఇక దాని సంగతి ఏమిటి కావలసి వస్తే దాన్ని ఆజ్ఞాపించవచ్చు. మొదటనే ఆజ్ఞాపించలే దాయన ఆత్మ రక్షణార్ధమని. దాని

Page 219

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు