సముద్రాన్ని వర్ణించవలసి వచ్చింది కవి. అది ఎంత గంభీరమైనదో అపారమైనదో భయంకరమైనదో ఆ వర్ణన ద్వారా మన మనోనేత్రాలకొక గొప్ప చిత్రం సాక్షాత్కరిస్తుంది. “సత్వైర్మహద్భిర్వికృతైః క్రీడద్భిర్వివిధైర్జలే - వ్యాత్తాస్యైః సుమహాకాయై రూర్మిభిశ్చ సమాకులమ్ సంకులం దానవేం ప్రైశ్చ పాతాళతలవాసిభిః రోమహర్షకరం దృష్ట్వా" అని ప్రారంభిస్తాడు కవి. చూచేసరికి శరీరాలు జలదరించాయట వారికి. వారి మాట అలా ఉంచి వింటూ ఉన్న పాఠకులకే జలదరిస్తుంది. అంతేకాదు. 'ప్రసుప్త మివచాన్యత్ర - క్రీడంతమివ చాన్యతః' ఒకచోట చూస్తే నిద్రపోతున్నట్టుందట సాగరం. మరొకచోట తరంగం హస్తాలతో ఆడుతూ ఉన్నట్టుంది. సాగర మచేతనం గదా. అది నిద్ర పోయేదేమిటి ? ఆడుకొనేదేమిటి? అదే ఆశ్చర్యం. అదే ఆశ్చర్యమనుకొంటుంటే ఇంకా ఆశ్చర్యకరమైన మాట చెబుతాడు మహాకవి. చింతయా మాససాగరః ఆ సముద్రం ఆలోచించిందట కూడా. ఏమని "సాహాయ్యం వానరేంద్రస్య యదినాహం హనూమతః కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతామ్.” నేనీ హనుమంతుడికి సహాయం చేయకపోతే నలుగురూ నన్నాడిపోసుకొంటారు. “అహమిక్ష్వాకు నాథేనసగరేణ వివర్థితః - ఇక్ష్వాకు సచివశ్చాయమ్” ఇక్ష్వాకు వంశీయుడైన సగరుడి మూలంగా నేనేర్పడ్డాను. ఇక్ష్వాకు వంశజుడైన రాముడి దూత ఇతడు. ఇంతదూరం లంఘిస్తూపోతే అలసట చెందుతాడు. అతడికి విశ్రాంతి కల్పించాలి. అంటూ తనలో దాగి ఉన్న మైనాకుడనే పర్వతరాజును పైకిలెమ్మని ఆదేశిస్తాడు. చూడండి. ఇది ఎంత చిత్రమో, అచేతనాలు కూడా మహర్షి దృష్టి కచేతనంగా కనపడవు. వాటిలో చేతన భావాన్ని చూస్తాడు చేతనోచితమైన వ్యవహారం వర్ణిస్తాడు. జడచేతనాలు రెండూ చేతనాలే వాల్మీకికి. అంతా భగవత్సృష్టే కాబట్టి భగవద్విభూతే అంతటా కనిపించాలి. భగవంతుడంటే అఖండ చైతన్యమే గదా. మరి తత్కల్పితమైన జగత్తు జడమెలా అవుతుంది. అదీ సచేతనమే. ఎటువచ్చీ అది పట్టణ పర్వతారణ్యాదులలో అనభివ్యక్తంగా దాగి ఉంది. దానిని మేలుకొలిపే ప్రయత్నం చేస్తాడు మహాకవి. వాటిని దేవతాత్మ అని పేర్కొనటం అందుకే. పైకి జడంగా కనిపించే వీటన్నిటికీ ఒక ఆత్మచైతన్యం అధిదేవతగా పని చేస్తుందట. అస్త్యుత్తరస్యాం దిశిదేవతాత్మా అని కాళిదాసు హిమాలయాన్ని వర్ణించాడంటే ఈ వాల్మీకి పంథాను అనుసరించే. లంకకు లంకిణి అనే రాక్షసి
Page 99