#


Index

సాంఖ్య యోగము భగవద్గీత

దేని నైనా కాల్చగలదు గాని ఆత్మను కాల్చలేదు. నచైనం క్లేదయం త్యాపః జలం కూడా దాన్ని తడపలేదు. నశోషయతి మారుతః గాలి అయితే దాన్ని ఆర్పనే లేదు.

  దీన్నిబట్టి తేలిందేమిటి. పృధివీ అగ్నీ జలం వాయువు Elements. అవి భౌతికమైన Compounds పదార్ధాలనైతే ఏమైనా చేయగలవు. పోతే భౌతికం Physical కాదు ఆత్మ. అభౌతికమైన Metaphysical తత్త్వమది. భౌతికాని కది అన్నివిధాలా విలక్షణ మైనది. అలాంటప్పుడివి దాన్ని ఎలా దెబ్బతీస్తాయి. అసంభవం.

అచ్ఛేద్యోఽయమదాహ్యోఽయమక్లేద్యోఽశోష్య ఏవ చ |
నిత్యః సర్వగతః స్థాణురచలోఽయం సనాతనః || 24 ||

  పృధి వ్యాదులైన నాలుగు భూతాలూ దాన్ని ఏమీ చేయలేవని ప్రతిపాదించారు. బాగానే ఉంది. కాని ఆకాశం సంగతి చెప్పలేదేమిటి. అది కూడా అచ్ఛేద్యమూ అదాహ్యమూ అక్లేద్యమూ అశోష్యమే గదా. ఒక ఖడ్గం చేతికి తీసుకొని ఆకాశాన్ని ఖండించగలవా. అగ్ని ఎంత రగులుకొల్పినా ఆకాశాన్ని కాల్చగలదా. మరి ఎంతో వర్షం కురుస్తుంటుంది. ఆ వర్షధార దాన్ని తడుపుతున్నదా. లేదుగదా. అలాగే దానిలోనే పుట్టి దానిలోనే వీస్తున్నది గాలి. అది దాన్ని ఏమి చేయ గలుగుతున్నది. ఆర్పగలుగుతున్నదా అలాంటప్పుడీ కనిపించే ఆకాశమే ఆత్మ అనుకొంటే సరిపోదా అని ప్రశ్న వస్తుంది.

Page 100

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు