సాంఖ్య యోగము
భగవద్గీత
నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః || 23 ||
జీవుడర్ధం చేసుకోలేక పోయినా - ఈశ్వరు డర్ధం చేసుకొంటాడని చెప్పినా తేడా వారి దృష్టిలో ఉండవలసిందే గాని ఆ వస్తువులో లేదు. వసించే దేదో అది వస్తువు. ఎప్పుడూ ఉన్న పదార్ధం. అది స్వతః ప్రమాణమైన ఆత్మ చైతన్యమే. మరేదీ కాదు. మరేదీ లేదు కూడా దాని దృష్టిలో. యేన సర్వమిదం తత మ్మని ఇంతకుముందే గ్రహించా మీ విషయం. సర్వవ్యాపక మన్నప్పుడేది గానీ దాన్ని దెబ్బ తీయలేదు. అన్నీ దాని స్వరూపమే గదా. అలాంటప్పుడది దాన్ని ఎలా బాధించగలదు. సముద్రమంతా జల స్వరూపమే. అందులో పైకి వచ్చే తరంగ బుద్బుదాదులు కూడా జలమే గాని వేరు గావు. ఇప్పుడా తరంగ జలం సముద్ర జలాన్ని ఏమి చేయగలదు. మేలు చేయదు. కీడు చేయదు.
అలాగే ప్రస్తుతం సచ్చిద్రూపమైన ఆత్మలో నుంచి సర్వప్రపంచమూ తరంగాలలాగా జన్మిస్తూ ఉంది. అందులోనే లయమవుతుంది. అలాంటప్పుడీ ప్రపంచం దాన్ని ఏమి చేయగలదు. ప్రపంచమంటే పంచభూతాత్మకమే గదా. పంచభూతాలంటే ఏమిటి. పృధి వ్యప్తే జోవా య్వాకాశాలు. శస్త్రాలన్నీ పృధివీ వికారాలే గదా. నైనం ఛిందంతి శస్త్రాణి అస్త్రశస్త్రాదులెన్ని ప్రయోగించినా ఆత్మ దెబ్బ తినదు. పృధివి దాని మీద చేయి చేసుకోలేదని అర్థం. అలాగే నైనం దహతి పావకః - అగ్ని
Page 99