#


Index

అంగాంగి భావము

చాటుతుంది. కాగా యుద్ధకాండ ఆరంభంలో విభీషణుడి శరణాగతి అక్కడి నుంచి విభీషుడితో రాముడి మైత్రీ, ఇదంతా తరువాత రావణుడి సంహారమూ, విభీషణుడి రాజ్యపాలనా, అనివార్యమని సూచించటమే అంతేగాక రాజసతామసులను శిక్షించటమే గాక సాత్త్వికులను రక్షించటం కూడా భగవంతుడి వ్రతమనీ తద్వత పరిపానలమే సుగ్రీవుడి విషయంలో చూపాడనీ, దానికి మరొక ఉదాహరణమే ఈ విభీషణమైత్రి అనీ కూడా గ్రహించవలసి ఉంటుంది. లోకనీతే గాక రాజనీతిని బట్టి చూచినా ఇందులో ఎంతో ఉంది గ్రహించవలసిన అంతరార్ధం.

  మరి అన్నీ ఒక ఎత్తు. ఉత్తరకాండలోని ఉపాఖ్యానా లొకెత్తు. ఇవన్నీ రాముడికి సంబంధించినవైతే అవి చాలావరకు రావణుడికి చెందిన కథలు. రావణుడి తపశ్చర్యా, వరగర్వమూ, త్రిలోక సంచారమూ, విజయపరంపరా ఒకవైపు చూపుతూనే మరొకవైపు అతని పరాజయ పరంపరకూడా ప్రదర్శిస్తాయా కథలు. వాలి, కార్తవీర్యుడు, శ్వేతద్వీప వాసినులైన స్త్రీలు, అతనికెలా బుద్ధి చెప్పారో తెలుస్తుంది. అలాంటి వారినంతా జయించిన శ్రీరాముడి చేతిలో అతడు మరణించాడంటే ఆశ్చర్యమేముందని కూడా మన మీ కథలవల్ల గ్రహించవలసిన రహస్యం. మరి నందికేశ్వరుడేమి, వేదవతి ఏమి, అనరణ్యుడేమి, నలకూబరుడేమి, వీరంతా అతణ్ణి శపించిన వృత్తాంతాలు కూడా వస్తాయి. అవన్నీ అంత మహిమాన్వితుడైనా అసాధువర్తనుడైనవాడు కడపట ఎలా చెడిపోక తప్పదో ఆ విధానాన్ని మనకు అక్షరాలా స్ఫురింపజేస్తాయి.

  ఇలా చూస్తూ పోతే రామాయణంలో మొదటినుంచీ చివరిదాకా ఎన్నెన్నో ప్రాసంగికమైన వృత్తాంతాలు తారసిల్లుతాయి. అవన్నీ కూడా ప్రధానేతి వృత్తానికి ఏదో ఒకవిధంగా దోహదం చేసేవే. ఇతివృత్తమొక మహానది అయితే ఇవన్నీ దానిలో చేరిపోయే ఉపనదులని కదా పేర్కొన్నాము. ఉపనదులు వాటి పాటి కవి అయిపోతే ప్రయోజనంలేదు. మహానదితో ఏకమై అఖండంగా ప్రవహించినప్పుడే వాటికి సార్ధక్యం. ప్రధాన కథకూ వాటివల్ల ఉపయోగం. రామాయణంలో ఏ ఒక్క చిన్న సన్నివేశం చూచినా అలాగే సాగింది. కథకూ తద్ద్వారా కథానాయకుడికి పుష్టినీ పూర్ణత్వాన్నీ చేకూర్చేవే. పూర్వాపర సన్నివేశాలొకదానికొకటి అందిపుచ్చుకొన్నట్టు ముందుకు సాగుతూ వచ్చి చివరకన్నీ కలిసి గమ్యంవైపు పయనించి ఆ లక్ష్యంలోనే

Page 94

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు