రహస్యంగానే ఉంచాడెవరికీ చెప్పకుండా దశరథుడు. తనకు తెలుసు ఋషి కామారుణ్ణి వధించిన నేరానికి, అతని తండ్రి తనకిచ్చిన శాపానికి, ఫలంగా తనకు తన కుమారుడితో వియోగమెప్పటికైనా ఏర్పడుతుందని. దానితో తనకు మరణం కూడా తప్పదని. ఊరక లోక మాడిపోసుకొనేందుకు పనికి వచ్చారు మంధర కైక. పాపం వారు బాహ్యంగా ఒక నిమిత్తమయ్యారు రామ వనవాసానికి. దశరథ మరణానికి అసలు కారణం దశరథుడికి అంతకు ముందెప్పుడో సంభవించిన ఆ మునిశాపమే. ఇది అంతవరకూ గుండెల్లో కుంపటిలాగా దాచుకొన్న దశరథుడు రామప్రవ్రాజ నానంతర మిక తప్పని సరి అయి ఒక్కసారిగా వెళ్లగ్రక్కుతాడు భార్య కౌసల్య దగ్గర. దీనివల్ల విధివిలాసమంటే ఏమిటో ? దానికి మానవులెలా నిమిత్త మాత్రులోమనకు బాగా అర్థమవుతుంది. అంతేగాక కైకమీద పాఠకులకేర్పడిన హేయభావం కూడ తొలగిపోతుంది. రాముడి వనగమనంలో ఉన్న అంతరార్ధం కూడా బోధపడుతుంది. అయోధ్యాకాండలోనే గుహుడు, భరద్వాజుడి వృత్తాంతాలు రెండు వస్తాయి. ఇందులో మొదటిది రాముడికి లోకంలో దూరానా దగ్గరా, అన్ని రంగాల్లో, అన్ని జాతుల్లో ఎలాంటి ప్రఖ్యాతి ఉందో ఎంత లోకమాన్యత ఉందో తెలుస్తుంది. మరి రెండవది భరతుడి చిత్తశుద్ధికీ నిస్స్వార్థ బుద్ధికీ అద్దం పడుతుంది.
ఇక అరణ్యలో విరాధుడనే రాక్షసుడెదురవుతాడు రామలక్ష్మణులకు. ఇదే మొదటి అవరోధం వారికి రాక్షసులవల్ల. వాడు బలవంతంగా సీతను పట్టుకొని రామలక్ష్మణులను చూచి ఈవిడను నాకు భార్యగా చేసుకొంటాను, మీ రక్తాన్ని పానం చేస్తాను, నిత్యము నేనిక్కడ ఋషుల రక్తమాంసాలు భక్షించటం నాకలవాటే నంటాడు. ఇది రాబోయే ఖరదూషణాదుల చర్యను సూచిస్తున్నది. సీతను వాడపహరించటము రాముడది చూచి నిర్వేదం చెందటము, తరువాత రావణుని సీతాపహరణము, ముందుగా ధ్వనింపజేస్తున్నది. రామలక్ష్మణులను వాడు మోసుకొనిపోవటము, వాణ్ణి వధింప రామలక్ష్మణులు తరువాత శరభంగ దర్శనం చేయటము, తరువాత యుద్ధరంగంలో ఇంద్రజిద్రావణాదుల వల్ల మొదట మోసపోయిన రామలక్ష్మణులు చివర వారి మాయాబలాన్ని ఛేదించి వారి నంతమొందించి తరువాత విజేతలయి మహర్షుల అభినందన లందుకొనే భవిష్య ద్వృత్తాంతాన్ని చక్కగా సూచన చేస్తుంది. ఈ విధంగా ఇది ప్రధాన కథతో ఎంత
Page 88