దిశగా బయలుదేరి అక్కడ విశాలా సమీపంలో తపస్సు చేయసాగుతాడాయన. ఆ కాలంలో అయోధ్యాధిపతి అంబరీషుడు. అతడు యజ్ఞం చేస్తుంటే యజ్ఞపశువు తప్పించుకుపోతుంది. దీనికి ప్రాయశ్చిత్తం ఆ పశువునైనా తెప్పించండి లేదా ఒక మానవుడినైనా బలి ఇవ్వండని సలహా ఇస్తారు ఋత్విక్కులు. ఎంత వెదకినా పశువు కనబడదు. అప్పుడు ఋచీకుడనే ఋషికి కొన్నివేల గోవుల నిచ్చి అతడిపుత్రుడు శునశ్శేపుణ్ణి కొని తెస్తాడు. అతడెవరో కాదు. విశ్వామిత్రుడి మేనల్లుడే. వచ్చి వెంటనే తన మామకాళ్లమీద బడతాడా కుర్రవాడు. వాణ్ణి కాపాడండని తన కుమారులకు చెప్పి వారు వినకపోతే శపిస్తాడు వారిని. కుర్రవాడికి రెండు మంత్రాలు చెప్పి ఇవి జపించు నీకు మేలు జరుగుతుందని పంపుతాడు. అతడా మంత్రాలతో ఇంద్రుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకొని అతడివల్ల దీర్ఘాయుష్షు పొందుతాడు.
తరువాత విశ్వామిత్రుడు పుష్కరంలో తపస్సు చేస్తుంటే వర్ష సహస్రం గడచిపోతుంది. ఇంద్రుడాయనకు తపోభంగం చేయటానికి మేనకను పంపిస్తాడు. దాని వలలో చిక్కి పదివేల సంవత్సరాలు తపస్సుకు తిలాంజలి ఇస్తాడు మహర్షి దాన్ని పరిత్యజించి మరలా తపశ్చర్యకు పూనుకుంటాడు. బ్రహ్మ ప్రత్యక్షమయి నీవింకా జితేంద్రియుడివి కాలేదు. ఇంకా ప్రయత్నించమని చెప్పి వెళ్ళతాడు. తరువాత రంభను పంపుతాడు దేవేంద్రుడు. దాన్ని పదివేల సంవత్సరాలు శిలపై పడి పొమ్మని శపిస్తాడు విశ్వామిత్రుడు. తరువాత పశ్చాత్తాప్తుడై కోపతాపాలకు స్వస్తి చెప్పి పరమ శాంతుడై హిమవత్రాంతంలో మరొక వేయి సంవత్సరాలు దారుణమైన తపస్సు సాగిస్తాడు. దానికి త్రిలోకాలూ దద్దరిల్లి దేవతలంతా పరుగెత్తి వచ్చి అయ్యా మీరు బ్రహ్మర్షులయ్యారు. ఇక చాలించండి తపస్సంటారు. అయితే నాకు వేదాలు వేదాంగాలూ, ప్రణవమూ వశపడాలి. వసిష్ఠుడు కూడా ఇదేమాట అనాలి నన్నని పట్టుపడతాడాయన. వసిష్ఠుడు కూడా వచ్చి అలాగే అంటాడు. ఇరువురూ సాదరంగా సస్నేహంగా ఒకరినొకరు కౌగలించుకొంటారు. ఇలాగా బ్రాహ్మణ్యం గడించాడీ మహాత్ముడని వర్ణిస్తాడు శతానందుడు.
ఇదంతా దేనికి వర్ణించినట్టింత దూరం. విశ్వామిత్రుడు సూర్యవంశీయుడు. సుక్షత్రియుడు రాముడికి గురువు. గురువు మాటలే గాక జీవితంకూడా శిష్యుడి కాదర్శం కావాలి. ఆ జీవిత మెలాంటిదో శతానందుడి ముఖతః విన్నాడు రాముడు.
Page 86