రెండూ సంబంధాన్ని పెట్టుకొన్నాయి. తరువాత అంతరాత్మ ప్రబోధం కలిగింది. దానితో ఇంద్రుడఫలుడయ్యాడు. అంటే జీవుడికి శబ్దాదుల మీద ప్రసరించే స్వభావం తొలగిపోయింది. శబ్దాదులకూ ఈ జీవాత్మకు గోచరించి అతణ్ణి బాధించే స్వభావమూ తొలగిపోయింది. రాముడి ప్రవేశంతో అది మరలా దర్శనమిచ్చిందంటే ఏమిటర్ధం. జీవుడికీశ్వరభాన మబ్బిన తరువాత మరలా ఈ ప్రపంచం దృష్టి గోచరమైనా దీనితో వ్యవహరించినా ప్రమాదం లేదని. ఆ పాటికి తపస్సుచేత శుద్ధమవుతుందది. జ్ఞానాగ్నిలో బడి అ నాత్మ జగత్తు ఆత్మాకారంగా మారి కనిపిస్తుందని భావం.
ఇంత ఉంది దీనిలో మర్మం. అయితే ఇదంతా వ్యాఖ్యాతల స్వకపోల కల్పన అని హేతువాదులు కొట్టి వేయవచ్చు. అలాంటప్పుడు కూడా వారి భాషలో వారికొక సమాధానమివ్వవచ్చు. కథలు అనులోమంగానే గాక ప్రతిలోమంగానూ బోధిస్తాయి మనకు నీతిని. రామాదివ ద్వర్తితవ్యమ్ - నరావణాదివత్తని అన్నారంటే ఈ దృష్టితోనే గదా అన్నారు. ప్రసుత మీ కథ కామపురుషార్ధమెంత చెడ్డదో - ధర్మవిరుద్ధంగా సేవిస్తే అది మానవుడి జీవితాన్ని ఎలా పతనం చేస్తుందో లోకానికి చాటి చెప్పటానికే. దేవతలవంటి వారే ఋషులవంటి వారే దానికి బలవుతున్నారంటే ఇక సహజంగానే దుర్బలులైన మానవులమాట చెప్పేదేముందని కైముతిక న్యాయంగా దాని ప్రాబల్యాన్ని చూపటానికే అహల్యా సంక్రందనుల మీద నెపం పెట్టి కథ అల్లాడు మహర్షి. ఇంతకూ స్త్రీకి గాని, పురుషుడికి గాని కామైక పరత్వం పనికిరాదని - అది పురుషుడికి వీర్యహానీ - స్త్రీకి మొగం చాటు చేసుకొని బ్రతకవలసిన దౌర్భాగ్యాన్ని, ఒదవిస్తుందని కనుక దాన్ని సర్వాత్మనా దూరం చేసుకోవాలని గ్రహిస్తే చాలు మానవుడు. ఒకవేళ తాత్కాలికంగా దాని కగ్గమయినా మరలా ఇంద్రియ మనశ్శుద్ధి రూపమైన తపస్సు చేసి బాగుపడమని కూడా ఉపదేశిస్తున్నదీ కథ మనకు. ఇది రాముడికి విశ్వామిత్రుడు చెప్పటంలో కూడా ఎంతో ఉంది భావగాంభీర్యం. బ్రహ్మచర్యంలోనే కాక తరువాత గార్హస్థ్యంలో కూడా కామైకతానతా పనికిరాదు. ఏకపత్నీ వ్రతం పరకాంతా పరాఙ్ముఖత్వం విధిగా పాటించవలసి ఉంటుంది. రాముడు తరువాత సీతావిషయంలో - శూర్పణఖాదుల విషయంలోనూ వర్తించిన వ్యవహారాని కిది ఎలా అద్దం పడుతున్నదో చూడండి.
Page 84