రాముడి వ్యవహారం. వాల్మీకి తన కావ్యంలో ఆ పాత్రనలాగే దిద్ది తీర్చినట్టు కనిపిస్తుంది. దీనికి తోడు భగవాన్ అనే మాట రాముడికి విశేషణంగా ఎక్కడా ప్రయోగించడాయన. దశరథాత్మజః కాకుత్స: ఇక్ష్వాకు కులవర్ధనః రాజపుత్రః పురుషోత్తమః ఇలాంటి మానవోచితమైన మాటలతోనే ఆయనను పేర్కొంటాడు. దీనిని బట్టే కృష్ణుడు లీలా మానుషుడైతే రాముడు మాయా మానుషుడనే నానుడి వచ్చింది లోకంలో.
అయితే ఇవన్నీ కేవలం పైపైన చూచి మన మనుకోవలసిన మాటలు. అంతేగాని నిజానికిద్దరూ లీలామానుషులే. ఇద్దరు మాయా మానుషులే. మాయ అన్న, లీల అన్న, ఒకటే తేడా లేదు. అది ఆ పరమాత్మకు స్వాభావికంగా ఏర్పడిన ఒకానొక శక్తి. ఆ శక్తిని వశీకరించుకొనే అవతరిస్తాడా పరమేశ్వరుడు. కృష్ణుడైనా అలాగే అవతరించాడు. రాముడైనా అలాగే అవతరించాడు. అందులో ఎవరూ మాయ కధీనులు కాలేదు. మీదు మిక్కిలి మాయనే తమ కధీనం చేసుకొని జన్మించారు. అందుకే అది అవతార మయిందసలు. లేకుంటే మనలాగాఅదీ ఒక ప్రారబ్ధ కర్మ వశాత్తూ ఏర్పడిన జన్మే కావలసి వచ్చేది. కాని ఇందులో జరిగిన చమత్కారమేమంటే ప్రారబ్ధాన్ని అనుసరిస్తూ ఉన్నట్టు నటించాడు రాముడు. కృష్ణుడలా నటించలేదు. కనుకనే రాముడు మనబోటి జీవకోటిలాగా మాయాధీనుడయి జీవించాడని భ్రాంతి పడతారు లోకులు. ఇతిహాసం గనుక అలా మానవోచితమైన నటన చేయవలసి వచ్చిందే గాని లోతుకు దిగి చూస్తే అందులోను పరిపూర్ణమైన భగవత్తత్త్వమే అడుగడుగునా దాగి ఉన్నదని గుర్తించగలం.
ఇది వాల్మీకి మహర్షి రచనలో మొదటినుంచీ చివరిదాకా అంతర్వాహినిగా ప్రవహిస్తూనే ఉంది. బాహ్యానికి లౌకికంగాను, ఆంతర్యంలో పారలౌకికంగాను, సడుపుతూ వచ్చాడు తన కావ్యాన్ని మహర్షి, ఇతిహాసంగానే గాక కాంతా సమ్మితమైన ఒక కావ్యంగా కూడ తన రచనను భావన చేశాడు కాబట్టి ఆయన ఇంత వ్యంగ్యార్థ
Page 8