అనంతరం వారంతా మహర్షి పరివారంతో కలిసి గంగాతీరం చేరుతారు. ఆ రాత్రి అక్కడ విడిసిన తరువాత ప్రాతః కాలకరణీయాలు తీర్చుకొని శిష్యుడు గురువు గారిని చూచి ఈ గంగానదీ జన్మ వృత్తాంతమేమిటో చెప్పమని కోరుతాడు కోరటమే తడవుగా విశ్వామిత్రుడిక పార్వతీ పరిణయం దగ్గరి నుంచీ వివరిస్తూ పోతాడు. గంగావతరణానికి పార్వతీ పరిణయానికి ఏమిటి సంబంధం. సంబంధం తరువాత ఎప్పుడో కలుపుతాడు విశ్వామిత్రుడు. అంతవరకూ కథను త్రుంచి త్రుంచి అంచెలవారీగా కొనసాగిస్తాడు. రాముడు మధ్య మధ్య అడుగుతూ పోతాడు. తరువాత ఏమిటో చెప్పమని. అడిగేకొద్దీ చెబుతూ పోతాడు విశ్వామిత్రుడు. మొదట కుమారస్వామి జన్మవృత్తాంతం చెబుతాడు. ఈశ్వర తేజస్సు అగ్నిదేవుడిలో ప్రవేశించటమూ, అతణ్ణి గంగానదిలో అది ప్రవేశపెట్టటమూ గంగానది భరించలేక హిమవత్పాద భూమిలో న్యాసం చేయటమూ అయి అక్కడ కుమారుడు జన్మించి కృత్తికాస్తన్య పానం చేసి కార్తికేయుడవుతాడు. షడాననాలతో చేసి షణ్ముఖడవుతాడు.
తరువాత దేవసైన్యాన్ని నడపి సేనాని అనిపించికొంటాడు. దానవ బలాన్ని జయించలేని దేవతల ప్రార్ధనకు ప్రసన్నుడైన మహాదేవుని సంకల్పం వల్ల జరిగినదే ఇదంతా. అది మహాదేవుని సంకల్పమైతే మహావిష్ణువు సంకల్పం కూడా ఇలాంటిదే గదా. రావణుడి బాధలు పడలేక మొరపెట్టిన దేవతల కార్యంకోసమే గదా ఈ దశరథ కుమారుడి జననం కూడా. దేవసైన్యాని కతడధిపతి అయినట్టు ఇతడు కూడా ఆ దేవతాంశలలోనే జన్మించిన వానర సైన్యానికధ్యక్షత వహించే గదా రాక్షసుడితోడి యుద్ధానికి తలపడ్డాడు. తరువాత జరగబోయే వానర రాక్షస యుద్ధాన్నీ అందులో కుమారునిలాంటి దశరథ కుమారుని విజయాన్ని ఎలా సూచిస్తూ నాందీ పలుకుతున్నదో చూడండి ఈ వృత్తాంతం.
అంతటితో నిలువలేదు ఆ కథకుడు. రాముడాయన నడిగింది అసలు గంగావతరణ వృత్తాంతం. ఆయన ఇంతవరకూ చెప్పింది ఉమాకుమార వృత్తాంతం. ఏమిటీ అప్రస్తుత ప్రశంస. అప్రస్తుతం కాదిది. రెంటికీ సంబంధముంది. ఉమా, గంగా ఇద్దరూ హిమవత్పుత్రికలే పవిత్రచరిత్రలే. ఉమయందు నిక్షిప్తం కావలసిన శైవతేజం చివరకుగంగలో నిక్షిప్తమయింది. తద్ద్వారానే కుమారుడు జన్మించాడు. తేజో 2 బన్నాత్మకం గదా సృష్టి. అదికూడా ఇక్కడ ధ్వనిస్తూ ఉంది. అగ్ని తేజస్సుకూ,
Page 79