#


Index

అంగాంగి భావము

సాగారట. ఇది ఎందుకు చెప్పినట్టి వృత్తాంతం. పురుషుడికే కాదు బ్రహ్మచర్యపాలన. స్త్రీకి కూడా కన్యాత్వపాలన మనేది అత్యావశ్యకమని చెప్పటానికి. ఇరువురూ నిష్కామంగా దాంపత్య జీవితం గడిపినప్పుడే లోకాని కాదర్శప్రాయమవుతారు. తరువాత సీతారాముల జీవితమలాంటిదే కావాలని అలాగే అవుతుందని మహర్షి శుభకామన.

  ఇంతేకాదు. కథా కథనమింతటితో ముగియలేదు. ఇంకా పొడిగించాడు. తరువాత కుశనాభుడు పుత్ర సంతానం కోసం ఒక ఇష్టి చేయటం. దాని ప్రభావంతో గాధి అనే కుమారుడతనికి జన్మించటం జరుగుతుంది. గాధికి జన్మించినవాడే విశ్వామిత్రుడు. ఈయన కొక అక్కగారు కూడా ఉంది. ఆవిడ పేరు సత్యవతి. ఋచీకుడనే ఋషికిచ్చి పెండ్లి చేస్తాడు తండ్రి. సశరీరంగా భర్తతోపాటు ఆవిడ స్వర్గానికి వెళ్లుతుంది. అయినా లోకహిత కామనతో కౌశికి అనే నదిగా హిమవత్పార్శ్వంలో ప్రవహిస్తుంది. ఆ సోదరిమీది స్నేహబంధం వదలుకోలేక నేనా నదీతీరంలోనే ఎంతోకాలం తపస్సు చేశానంటాడు విశ్వామిత్రుడు. చూడండి. విశ్వామిత్రుడెక్కడ ప్రారంభించి ఎక్కడికి వచ్చాడో. కుశనాభుడి కథ అంటూ తన కథనే చెప్పాడు చివరకు. తద్వారా తన వంశ గౌరవమెలాంటిదో బయట పెడుతున్నాడు. సపితా మమకాకుత్స - గాధిః పరమధార్మికః కుశవంశ ప్రసూతోస్మి కౌశికో రఘునందన మా తండ్రి ఎవరనుకున్నావు. పరమ ధార్మికుడు గాధి. ఆయన ఎవరు. కుశనాభుడి కుమారుడు. అలాంటి కుశవంశంలో పుట్టి కౌశికుడనయ్యాను నేను. మా అక్కకూడా పవిత్ర చరిత్ర. లోకహితం కోసం నది అయి ప్రవహించింది. ఇలాంటి పావనశీలమూ, పరహిత భావన ఉండాలి క్షత్రియుడికి. అది నాకెలాగో నీకూ అలాగే ఉండాలి సుమా అని హెచ్చరిస్తున్నాడు గురువు. గురువు ననుకరించటమే గదా శిష్యుడి లక్షణం. పైగా ఈ గురువు గురువు మాత్రమే కాదు రాముడికి రాముడే సూర్యవంశంలో జన్మించాడో ఆ సూర్య వంశంలోనివాడే విశ్వామిత్రుడు కూడా. మొదట అతడూ క్షత్రియుడే కదా. తనవంశాన్ని ఆయన పేర్కొన్నాడంటే ఇద్దరమూ ఒకే సూర్యవంశ్యులం. కనుక నాలాగే నీవూ సుచరితుడవూ, పరహితరతుడవూ అయి జీవించాలి సుమా అని గొప్ప దీవన కూడా ఇది.

Page 78

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు