రాముడు. ఆత్మారాముడే గదా దశరథ రాముడై జన్మించాడు. తెలియకపోవటమేమిటి. అయినా అలాఅడగటమొక నటన. అది నటన అని తెలిసేనేమో ప్రహస్య నవ్వుతూ జవాబిస్తాడు మహర్షి ఏమని, పరమశివుడు వివాహం చేసుకొని దేవతలతోపాటు తరలిపోతుంటే కాముడాయన నెదిరించి బెదిరించాడట. క్రుద్ధుడైన పరమేశ్వరుడు తృతీయనేత్రం తెరచి చూచేసరికి తన శరీరాంగములన్నీ సడలి క్రిందపడగా నిలువునా నీఱవుతాడతడు. అంగ విమోచనం చేశాడు కాబట్టి అది అంగదేశమయిందట. అనంగుడై కూడా తపస్సు చేశాడతడా ఆశ్రమంలో. ఇప్పటికీ అతని ననుసరించి తపస్సు చేసే మహామునులున్నారిక్కడ ఈ రాత్రి ఇక్కడ విశ్రమించి వెళ్లదామంటాడు విశ్వామిత్రుడు. ఈ కథ చెప్పటంలో ఏమిటి అంతరార్ధం. రాముడు బ్రహ్మచారి. బ్రహ్మచర్యంలో కామమనేది పనికిరాదు. కామం విద్యాభ్యాస దీక్షకు విరోధి. ఆ మాటకు వస్తే గార్హస్యంలో కూడా అది పనికి రాదు. బహుపత్నీ వ్రతమైతే అక్కడా అది చెరుపే. రాజానో బహువల్లభా అని క్షత్రియులు సాధారణంగా అనేక స్త్రీలోలురు. అలాంటి లౌల్యముంటే ధర్మాన్ని సమగ్రంగా పాటించలేరు. అందుచేత రాముణ్ణి నిష్కామమైన గృహస్థ జీవితాన్ని గడపమని ఒకవిధంగా ప్రబోధించటమిది. అందుకే కృతోద్వాహుడైన ఈశ్వరుణ్ణి కాముడు ప్రతిఘటించి పరాభూతుడయ్యాడని కథను మార్చి చెప్పటంకూడా.
తరువాత సిద్ధాశ్రమంలో తపోదీక్ష ముగించుకొని మిథిలకు పయనమవుతారు గురుశిష్యులు. దారిలో శోణానదీ తీరంలో బస చేస్తారు. అప్పుడు మరలా అడుగుతాడు రాముడీ ప్రదేశమెవరిది దీని ప్రభావమేమిటని. అప్పుడాయన కుశనాభకన్యల వృత్తాంతం ఉదాహరిస్తాడు. కుశనాభుడికి వందమంది కుమార్తెలైతే వారొకనాడు బాగా ముస్తాబు చేసుకొని ప్రమద వనంలో విహరిస్తుంటారు. వాయుదేవుడు వారి సౌందర్యానికి కామించి వారిని సంగమించాలని చూస్తే వారు అంగీకరించరు. అందుకు కనలి అతడు వారి అవయవాలను అష్టావక్రంగా చేసిపోతాడు. ఇంటికి వచ్చి తండ్రికి మొరపెడతారు వారు. తండ్రి వారి మనోధైర్యానికి మెచ్చుకొని తరువాత వారిని బ్రహ్మదత్తుడనే ఒక ఉత్తమ బ్రాహ్మణుడికి తపస్సంపన్నుడికిచ్చి వివాహం చేస్తాడు. అతడు వారి కరగ్రహణం చేయగానే వారి శరీరాలకు కలిగిన వక్రభావం తొలగిపోయి వారు యథాపూర్వం కలకలలాడ
Page 77